5 క్వింటాళ్ల ఉల్లిగడ్డలు చోరీ

13 Dec, 2019 02:17 IST|Sakshi

మిర్యాలగూడలో దుకాణం తాళం పగులకొట్టి అపహరణ

మిర్యాలగూడ అర్బన్‌: ఎవరైనా ఏం దొంగతనం చేస్తారు? డబ్బు, బంగారం, విలువైన వస్తువుల కోసం అని చెబుతాం. ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా విలువైనవిగా మారాయి. ఓ దుకాణంలో దొంగ లు పడి డబ్బు కాకుండా ఉల్లిగడ్డలను ఎత్తుకెళ్లారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఈ ఘటన జరిగింది. పట్టణంలోని పాతబస్టాండ్‌లో ఉల్లిగడ్డల వ్యాపారం నిర్వహిస్తున్న బక్కయ్య బుధవారం రాత్రి దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లాడు.

గురువారం ఉదయం వచ్చి చూసేసరికి దుకాణం తాళం పగులగొట్టి ఉంది. లోపల పది బస్తాల ఉల్లిగడ్డలు (5 క్వింటాళ్లు) కనిపించలేదు. చోరీ జరిగిందని గుర్తించిన బక్కయ్య, వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, పక్కనే డబ్బుల కౌంటర్‌ ఉన్నా దొంగలు దానిని ముట్టుకోలేదు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు