వడివడిగా రైల్వేల విద్యుదీకరణ 

15 Dec, 2018 03:10 IST|Sakshi

దక్షిణ మధ్య రైల్వేలో 50% విద్యుదీకరణ  

మెరుగుపడనున్న సరుకు రవాణా 

2022కి పూర్తి చేయడమే లక్ష్యం 

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా రైల్వేల విద్యుదీకరణపై భారతీయ రైల్వే దృష్టి సారించింది. రైల్వేలో సరుకు రవాణాను మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 13,000 కిలోమీటర్ల మేర విద్యుదీకరణను పూర్తిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థికశాఖ నిర్ణయించింది. ఇందుకోసం రూ.12,134 కోట్లు కేటాయించింది. 2021–22లోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా చేసుకుని పనులు ప్రారంభించింది. ఈ క్రమంలో ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించి మొత్తం 5,992 కిలోమీటర్లలో 3,775 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. అంటే దాదాపు 50% పనులు పూర్తయ్యాయని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌ యాదవ్‌ వెల్లడించారు. 

రాష్ట్రంలో 936 కి.మీ.. ఏపీలో 2,839కి.మీ భారతీయ రైల్వే ప్రారంభించిన విద్యుదీకరణలో భాగంగా ఇప్పటికే ఏపీలో 2,839.25 కిలోమీటర్లకు 2,112 కి.మీ, తెలంగాణలో 936 కి.మీలకు 886 కి.మీల మేర పనులు పూర్తయ్యాయి. ఈ పనుల్ని కేవలం రెండేళ్లలోనే పూర్తిచేసి జాతికి అంకితం చేశారు. 2017లో ముంబై–చెన్నై మార్గంలో వ్యూహాత్మకంగా వాడి– గుంతకల్లు సెక్షన్‌లో 228 కి.మీల మేర విద్యుత్‌ లైను పనులు పూర్తికావడంతో ఢిల్లీ– బెంగళూరు మధ్య రాకపోకలు మెరుగుపడ్డాయి. ఆయా మార్గాల్లో ఉన్న సిమెంటు సరుకు రవాణాకు ఇది ఎంతో దోహదపడుతోంది. 

మరిన్ని వార్తలు