ఉందా.. మంచికాలం ముందుముందునా..

27 Jun, 2020 01:56 IST|Sakshi

కరోనా నేపథ్యంలో మునుపటి పనులు మళ్లీ మామూలుగా చేసుకోగలమా?

511 ఎపిడమాలజిస్టుల అభిప్రాయాలను తెలుసుకున్న న్యూయార్క్‌ టైమ్స్‌

కరోనా ప్రపంచాన్ని కమ్మేసింది మొదలు భూమ్మీద మనిషి తీరూతెన్నూ పూర్తిగా మారిపోయాయి. బయటకు వెళ్లాలంటే ముఖానికి మాస్కు తప్పనిసరైంది. ఎక్కడకు వెళ్లినా శానిటైజర్‌తో ముందు చేతులు శుభ్రం చేసుకోవడం, ఉష్ణోగ్రతలు చెక్‌ చేయడం సాధారణమైపోయాయి. కరోనా వైరస్‌ కట్టడికి టీకా, లేదా వచ్చిన వ్యాధికి చికిత్స సాధ్యమయ్యే వరకు పరిస్థితి ఇంతేననేది ఖాయం. అయితే ఇది జరిగేదెన్నడు? మునుపటిలా మళ్లీ మంచిరోజులొస్తాయా? వస్తే ఎప్పుడు? మునుపు ఏ ఆలోచనా లేకుండా చకచకా చేసేసిన పనుల్ని మళ్లీ అలాగే చేయగటలమా? ఇవే ప్రశ్నలకు అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ వార్తా పత్రిక సుమారు 511 మంది ఎపిడమాలజిస్టుల (వ్యాధులపై పరిశోధనలు చేసే వారు)ను అడిగింది.

కరోనాకు ముందునాటి 20 దైనందిన కార్యకలాపాలపై వారిచ్చిన సమాధానాలు స్థూలంగా ఇలా ఉన్నాయి. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న అన్ని రకాల సమాచారం ఆధారంగా ఎపిడమాలజిస్టులు మరికొన్ని ప్రశ్నలపైనా తమ అభిప్రాయాలను చెప్పారు. ఏతావాతా తేలిందేమిటంటే.. పరిస్థితి చక్కబడేందుకు కొంచెం అటూఇటుగా ఏడాది పడుతుందని. అప్పటికీ కుదరని పనులు కొన్ని మిగిలే ఉంటాయన్నది కొసమెరుపు!.

మరిన్ని వార్తలు