తీరిన కల.. 52 ఏళ్ల వయసులో కవలలకు జననం

13 Oct, 2019 08:48 IST|Sakshi

52 ఏళ్ల వయసులో వారసుడి కోసం తపన ∙ ఐవీఎఫ్‌తో తీరిన కల

టవర్‌సర్కిల్‌ (కరీంనగర్‌): ఆమె అమ్మమ్మ.. అయినప్పటికీ వారసత్వం కోసం మళ్లీ పిల్లలు కనాలని తపించింది. ఆమె ఆశయానికి కరీంనగర్‌లోని డాక్ట ర్‌ పద్మజ సంతానసాఫల్య కేంద్రం అండగా నిలిచింది. 52 ఏళ్ల వయసులో కూడా పండంటి కవలలకు జన్మనిచ్చింది. భద్రాచలంకు చెందిన ఆరె సత్యనారాయణ, రమాదేవి దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు వివాహం కాగా, కుమారుడు 2013లో 13 ఏళ్ల వయసులో ప్రమాదవశాత్తు మరణించా డు.
(చదవండి : ఇది చాలా అనైతికం)

ఒంటరితనం బరించలేక ఐవీఎఫ్‌ ద్వారా పిల్లలు కనాలనే ఆలోచనకు వచ్చి కరీంనగర్‌లోని పద్మజ సంతాన సాఫల్య కేంద్రాన్ని సంప్రదించారు. డాక్టర్‌ పద్మజ ఐవీ ఎఫ్‌ చికిత్సను ప్రారంభించి, ఈ నెల 11న సాధారణ ప్రస వంచేశారు. రమాదేవి కవలలకు జన్మనిచి్చంది. ఐవీఎఫ్‌ పద్ధతిలో 55 ఏళ్ల లోపు వయసున్న ఎవరికైనా టెస్ట్‌ట్యూబ్‌ ద్వారా పిల్లలను కనే అవకాశం ఉందని సంతాన సాఫల్య కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్‌ పద్మజ తెలిపారు.  
(చదవండి : లేటు వయసులో... ఎంతటి మాతృత్వ అనుభూతులో)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు