నెలలు నిండకముందే..నూరేళ్లు నిండుతున్నాయి!

18 Nov, 2016 00:34 IST|Sakshi
నెలలు నిండకముందే..నూరేళ్లు నిండుతున్నాయి!

- రాష్ట్రంలో నెలలు నిండకుండా జన్మిస్తున్న శిశువుల మరణాలు 54 శాతం
- దేశ సగటు 35 శాతం కంటే ఎంతో అధికం
- యునిసెఫ్ సదస్సులో నిపుణుల ఆందోళన
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నవజాత శిశు మరణాలు ఆందోళనకర స్థారుులో పెరుగుతున్నాయి. రాష్ట్రంలో నెలలు నిండకుండానే జన్మించిన శిశువుల మరణాల శాతం 54. జాతీయ స్థారుులో ఈ సగటు 35 శాతంగా ఉంది. ఇక దేశవ్యాప్తంగా 35 లక్షల మంది శిశువులు నెలలు నిండకుండా జన్మిస్తున్నారు. దీని ఫలితంగా ఉత్పన్నమయ్యే సమస్యలతో వీరిలో 31 లక్షల మంది మరణిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా దాదాపు 1.5 కోట్ల మంది శిశువులు పుడుతుంటే... వారిలో పది లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. వీటికి ప్రధాన కారణం... నెలలు నిండకుండానే పుట్టడమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మొత్తంగా నవజాత శిశు మరణాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం అత్యావశ్యకమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్‌ఎన్‌ఎఫ్ సెక్రటరీ డాక్టర్ సురేందర్‌నాథ్ తెలిపారు.

‘ప్రపంచ ప్రి మెచ్యూరిటీ డే’సందర్భంగా నగరంలో గురువారం యునిసెఫ్ సదస్సు నిర్వహించింది. ఇందులో వైద్యరంగ నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అతిచిన్న వయస్సులోనే గర్భందాల్చడం, మలేరియా లేదా యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్స్, పౌష్టికాహార లోపం, దాని కారణంగా వచ్చే రక్తహీనత, తీవ్రమైన మధుమేహం, బీపీ లాంటి కారణాలతో నెలలు నిండకుండానే పిల్లలు పుడతారు. ఇందుకు కారణమైన ఇన్‌ఫెక్షన్‌‌సని దక్షిణాది రాష్ట్రాల్లో చాలా వరకు నివారించగలిగినట్టు తమ పరిశోధనలో వెల్లడైందని యునిసెఫ్ హెల్త్ చీఫ్ డాక్టర్ యరోన్ వాల్మన్ తెలిపారు.

 నివారణ ఎలా?
 తెలంగాణలో 13 నుంచి 15 శాతం బాల్య వివాహాలు జరుగుతున్నారుు. ఫలితంగా చిన్న వయస్సులోనే గర్భధారణ జరిగి, నెలలు నిండకుండానే పిల్లలు పుడుతున్నారని, దానితో పాటు పౌష్టికాహార లోపం, రక్తహీనతలను నివారించే దిశగా చర్యలు తీసుకోవడం అత్యవసరంగా డాక్టర్ శ్రీకృష్ణ అభిప్రాయపడ్డారు. సరైన మోతాదులోనే యాంటీనాటల్ స్టెరాయిడ్‌‌సని వాడటం కూడా నెలల నిండకుండా సంభవించే శిశుజననాలను అరికట్టవచ్చునని అందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నదని ఎంసీహెచ్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ డాక్టర్ నీలిమా సింఘ్ తెలిపారు. ఈ విషయమై అవగాహన పెంపొందించేందుకు రాష్ట్రంలో విస్తృతంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్టు నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ సి.సురేష్‌కుమార్ చెప్పారు. అతి చిన్న ప్రయత్నాలతోనే నెలలు నిండకుండా సంభవించే శిశువుల జననాలను, అలాగే మరణాలను 75 నుంచి 80 శాతం తగ్గించే అవకాశాలున్నాయని యునిసెఫ్ హెల్త్ స్పెషలిస్ట్ డాక్టర్ సంజీవ్ ఉపాధ్యాయ అన్నారు. యునిసెఫ్ పర్యవేక్షకులు ప్రసూన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు