583 గ్రాముల బంగారం స్వాధీనం

10 Jun, 2015 09:46 IST|Sakshi

హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికురాలి నుంచి కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం దుబాయి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుల లగేజీనీ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఓ మహిళ వద్ద 583 గ్రాములు బంగారాన్ని అధికారులు గుర్తించారు. బంగారానికి సంబంధించిన ఎటువంటి రసీదులు లేకపోవడంతో మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రయాణికురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
 
 

మరిన్ని వార్తలు