60 ఏళ్ల బల్దియా.. @కరీంగనర్‌

9 Jan, 2020 09:42 IST|Sakshi

1952లో మున్సిపాలిటీగా ప్రారంభం

2005లో కార్పొరేషన్‌గా మార్పు

నాటి నుంచి నేటి దాకా.. 

8 మంది మున్సిపల్‌ చైర్మన్లు..∙ఐదుగురు ఇన్‌చార్జి చైర్మన్లు

ఇద్దరు మేయర్లు – నలుగురు ప్రత్యేకాధికారులు

సాక్షి, కరీంనగర్‌  : కరీంనగర్‌ మున్సిపాలిటీకి ఘనమైన చరిత్రే ఉంది. 68 ఏళ్ల నుంచి మున్సిపాలిటీగా అటు నుంచి 2005లో కార్పొరేషన్‌గా మారి దేశంలోనే ఉత్తమ మున్సిపాలిటీల్లో ఒకటిగా నిలిచింది. ఎంతో మంది మున్సిపల్‌ చైర్మన్లుగా, కార్పొరేషన్‌ సభ్యులుగా ఎన్నికై సత్తాచాటి ఎమ్మెల్యే, ఎంపీలుగా కూడా పోటీ చేసి ఘనవిజయం అందుకున్నారు. ఎందరో గొప్ప రాజకీయ నాయకుల పోరాటాలకు, ఉద్యమాలకు కేంద్రంగా నిలిచిన కరీంనగర్‌ బల్దియా ఒక ప్రత్యేకమైన స్థానం పొందింది. కార్పొరేషన్‌ పలువురు నాయకుల ఏలుబడిలో ఈస్థాయికి చేరుకుంది. చరిత్ర పుటల్లో కూడా తనస్థానాన్ని లికించుకున్న ఈ ఏనుగులు తిరిగే ప్రాంతమైన కరినగరము..కాలక్రమేణ కరీంనగర్‌గా మారింది.

నాటి కుగ్రామమే...
రాజుల పాలనలో ఈ ప్రాంతం క్రీస్తుశకం 973–1153లో మొదట కళ్యాణి చాళక్యుల ఏలుబడిలో ఆరిఫిరాల అనే కరీంనగర్‌ ప్రాభవం ప్రారంభమైంది. నాటి రాజులకు ఆయుధగారంగా ఉన్న ఎలగందులకు వెళ్లే దారిలో ఈ గ్రామం ఉండేది. 1159–1323 వరకు కాకతీయులు, 1518–1687 కుతుబుషాహిలు, 1687–1724 ఢిల్లీ మొగళాయిలు, 1724–1948 వరకూ ఆసఫ్‌జాహీల పాలనలో తన ప్రస్థానం ప్రారంభించింది. 16, 17 శతాబ్ధంలో కుతుబుషాహీలు గోల్గొండ నుంచి అరబ్బులు ఇక్కడికి వచ్చేవారు. నదులు ఎప్పుడు పొంగిపొర్లే సమయంలో ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ముఖ్యంగా ఎలగందుల కోటకు వెళ్లేందుకు వచ్చే సమయంలో నదులు దాటడానికి ఎనుగులు(కరి) వినియోగించేవారు తర్వాత వాటిని ఇక్కడే ఉంచేవారు ఇలా నిత్యం ఎనుగుల సంచారంలో ఉండడంతో కరినగరముగా ప్రసిద్ధిచెందింది. కాలక్రమేణా కరీంనగర్‌గా మారిందని చెబుతారు. మరో కథనం ప్రకారం 19వ శతాబ్ధంలో కరీముల్లాషా అనే బాబా ఉండేవారు. వారి పేరు మీద కరీంనగర్‌గా ప్రసిద్ధి చెందిందని చరిత్ర చెబుతోంది. 

జిల్లా కేంద్రం నుంచి  కార్పొరేషన్‌ దాకా...
నిత్యం ఇటు రాజులు, వారి అనుచరుల రాకపోకలతో తర్వాత క్రమంలో పటేల్, పట్వారీ పాలనలో ఉన్న కరీంనగర్‌ 1905లో జిల్లా కేంద్రంగా ఏర్పడింది. 1948లో నిజాం ఏలుబడిలో ఉన్న తెలంగాణ ఇండియన్‌ యూనియన్‌లో విలీనం అయిన తర్వాత 1952లో మొదటిసారి మున్సిప్‌(ముని్సపల్‌) వ్యవస్థ ఏర్పాటు కావడంతో 1952లో కరీంనగర్‌ను మున్సిపాలిటీగా మార్చారు. మొదటి మున్సిపల్‌ చైర్మన్‌గా ఖాజా బషీరుది్దన్‌ ఎంపికై 12 ఏళ్లపాటు చైర్మన్‌గా పని చేశారు. చివరి చైర్మన్‌గా వావిలాల హన్మంతరెడ్డి పని చేశారు. 2005లో కరీంనగర్‌ను కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌ చేశారు. 2005లో కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌ చేసిన తర్వాత మొదటి మేయర్‌గా డి.శంకర్‌ ఎన్నికయ్యారు. 1952 నుంచి 2005 వరకూ 12 మంది మున్సిపల్‌ చైర్మన్లుగా పని చేశారు. నాలుగుసార్లు ప్రత్యేకాధికారుల పాలనలో ఉండిపోయింది. కరీంనగర్‌ దేశంలోని స్మార్ట్‌సిటీలో స్థానం పొంది అభివృద్ధివైపు వేగంగా అడుగులు వేస్తోంది. 1800 వందల కోట్ల పనులతో పలురకాల పనులు ప్రారంభమై స్మార్ట్‌సిటీగా మారుతోంది. 

స్మార్ట్‌సిటీగా...
స్మార్ట్‌సిటీగా మారిన కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో అభివృద్ధి వేగంగా జరుగుతోంది. 1872 కోట్ల రూపాయలతో స్మార్ట్‌సిటీ పనులు వేగంగా జరుగుతున్నాయి. దేశంలోనే మొట్టమొదటి తీగల వంతెన పనులు వేగంగా పూర్తవుతున్నాయి. ఒక పక్క రాష్ట్రంలోనే రెండోఅతిపెద్ద ఐటీటవర్‌ పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమైంది. అటు తర్వాత మానేరు రివర్‌ఫ్రంట్‌ నిర్మాణానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఒక్క అతిపురాతనమైన క్లాక్‌టవర్, కమాన్‌ చౌరస్తా దేశంలోనే అత్యంత భద్రత ఉన్న 4వ నగరంగా సుమారు 28 కిలోమీటర్ల విస్తీర్ణంతో అభివృద్ధివైపు సాగిపోతోంది.

ఎంతో మంది నాయకులు
1952 నుంచి 2005 వరకూ 8 మంది కరీంనగర్‌ చైర్మన్లుగా, ఐదుగురు ఇన్‌చార్జి చైర్మన్లుగా, నలుగురు ప్రత్యేక అధికారులు, ఇద్దరు మేయర్లుగా పని చేశారు. 2005లో కార్పొరేషన్‌ మారే సమయంలో 50 డివిజన్లు ఉండేవి. కరీంనగర్‌ జనాభా 2,72,194 మంది ఉండగా కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం 60 డివిజన్లుగా మారింది.

ఏడాది    చైర్మన్లు
1952–64    ఖాజా బషీరుది్దన్‌
1964–64    శివనారాయణ ముందడా(ఇన్‌చార్జి)
1964–65    ప్రేమలత దేవి(ఇన్‌చార్జి)
1965–68    ప్రేమలత దేవి(ఇన్‌చార్జి)
1969–70    రాంపాల్‌ లావోటి
1970–74    జేఆర్‌ గోపాల్‌రావు
1975–81    ప్రత్యేకాధికారి
1981–85    నరహరి లక్ష్మన్‌
1986–86    మహ్మద్‌బిన్‌ ఆలీ(ఇన్‌చార్జి)
1986–86    కఠారి దేవేందర్‌రావు
1986–87    ప్రత్యేకాధికారి
1987–92    కఠారి దేవేందర్‌రావు
1992–95    ప్రత్యేకాధికారి
1995–99    కఠారి దేవేందర్‌రావు
1999–2000    వావిలాల హన్మంతరెడ్డి(ఇన్‌చార్జి)
2000–2005    వావిలా హన్మంతరెడ్డి
2005–10    డి.శంకర్‌ (మేయర్‌)
2010–14    ప్రత్యేకాధికారి
2014–19    రవీందర్‌సింగ్‌

మరిన్ని వార్తలు