సొంతూళ్లకు విద్యార్థులు

6 May, 2020 03:10 IST|Sakshi

ఏపీ నుంచి తెలంగాణకు..

614 మంది 22 ప్రత్యేక బస్సుల్లో రాక

అనుమతి పత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు

అలంపూర్‌: వలస కార్మికులు, విద్యార్థులు సొంత రాష్ట్రాలు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వివిధ రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ విద్యార్థులు, వలస కార్మికులు అక్కడి అధికారుల అనుమతి పత్రాలతో స్వరాష్ట్రానికి వస్తున్నారు. ప్రభుత్వం కల్పించిన వెసులుబాటుతో ఏపీలోని నంద్యాల, కర్నూలు తదితర ప్రాంతాల్లో విద్యనభ్యసిస్తున్న 614 మంది విద్యార్థులు సోమవారం అర్ధరాత్రి 22 ప్రత్యేక బస్సుల్లో రాష్ట్ర సరిహద్దులోని పుల్లూరు చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నారు. వీరిలో జోగుళాంబ గద్వాల, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారున్నారు. ఆర్డీఓ రాములు, సీఐ వెంకట్రామయ్య ఆధ్వర్యంలో సిబ్బంది విద్యార్థుల వద్ద ఉన్న అనుమతి పత్రాలు పరిశీలించి, థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించారు. వైద్యపరీక్షల అనంతరం వారిని 14 రోజుల హోం క్వారంటైన్‌లో ఉండాలని స్టాంప్‌ వేసి పం పారు. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు అధిక సంఖ్య లో వచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్లుగా అధికారులు సరిహద్దులో చర్యలు తీసుకుంటున్నారు.
మొదట్లోనే ప్రయత్నించినా..: వాస్తవానికి తొలి విడత లాక్‌డౌన్‌లోనే.. నంద్యాలలో బ్యాంక్‌ పోస్టులకు కోచింగ్‌ కోసం వెళ్లిన విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్లడానికి ప్రయత్నించారు. అప్పట్లో పోలీసులు అనుమతించలేదు. 

మరిన్ని వార్తలు