రాష్ట్రంలో పోలింగ్‌ 62.69%

13 Apr, 2019 04:36 IST|Sakshi

లోక్‌సభ ఎన్నికల తుది ఓటింగ్‌ వివరాల ప్రకటన

ఖమ్మంలో అత్యధికంగా 75.28%, 

హైదరాబాద్‌లో అతితక్కువగా 44.75% నమోదు

గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 8.06 శాతం తగ్గుదల

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 62.69 శాతం పోలింగ్‌ నమోదైంది. 17 లోక్‌సభ నియోజకవర్గాలకు గురువారం జరిగిన పోలింగ్‌ తుది వివరాలను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం శుక్రవారం ఈ మేరకు ప్రకటించింది. దీని ప్రకారం అత్యధికంగా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో 75.28 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యల్పంగా హైదరాబాద్‌ పార్లమెంటు సెగ్మెంట్‌లో 44.75 శాతం మంది ఓటేశారు. పూర్తిగా పట్టణ ప్రాంత సెగ్మెంట్లైన మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్‌ నియోజకవర్గాల్లో తక్కువ ఓటింగ్‌ నమోదైంది.

వేసవి ఎండల తీవ్రత వల్ల పట్టణ ప్రాంతాల్లో మెజారిటీ ఓటర్లు బయటకు రాలేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో 70.75 శాతం పోలింగ్‌ నమోదైంది. గత ఎన్నికల పోలింగ్‌ గణాంకాలతో పరిశీలిస్తే ఈసారి ఎన్నికల్లో ఏకంగా 8.06 శాతం మేర పోలింగ్‌ తగ్గడం గమనార్హం. 2014లో రాష్ట్రంలో ఒకేసారి శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో గడువు ముగియకముందే శాసనసభ రద్దు కావడంతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో గతేడాది డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 76.07 శాతం ఓటింగ్‌ జరిగింది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కుటుంబ కథా చిత్రం!

ఒక్కో ఓటుపై రూ.700

అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా?

రెండు చోట్ల అందుకే ఓడిపోయా: పవన్‌

గడ్కరీ ఓడిపోతాడు.. ఆడియో క్లిప్‌ వైరల్‌!

సీఎంతో విభేదాలు.. కేబినెట్‌ భేటీకి డుమ్మా!

నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కొంటున్నారు

మాయ, అఖిలేష్‌ల ఫెయిల్యూర్‌ స్టోరీ

అంతా మీ వల్లే

బాబు వైఎస్సార్‌సీపీలోకి వెళితే నేను..

కేశినేని నాని కినుక వెనుక..

కొన్నిసార్లు అంతే.. !!

ఎంపీ కేశినేని నానితో గల్లా భేటీ

‘మాతో పెట్టుకుంటే పతనం తప్పదు’

టీడీపీకి ఎంపీ కేశినేని నాని షాక్‌!

చీఫ్‌ విప్‌గా మార్గాని భరత్‌ రామ్‌

‘మహాఘఠ్‌ బంధన్‌’ చీలిపోయింది...

గిరిరాజ్‌కు అమిత్‌ షా వార్నింగ్‌

అఖిలేశ్‌ భార్యను కూడా గెలిపించుకోలేకపోయాడు!

యూపీలో కూటమికి బీటలు..?

జగన్‌ పాలనను.. చూస్తున్నారా చంద్రబాబూ?

సంఖ్యే ముఖ్యం... శాతం కాదు

గాంధీజీపై ఐఏఎస్‌ అధికారిణి వివాదాస్పద వ్యాఖ్య

బదులు తీర్చుకున్న నితీశ్‌

నితీశ్‌ కేబినెట్‌లోకి కొత్త మంత్రులు.. బీజేపీకి కౌంటర్‌!

మళ్లీ అదే జోడీ

‘త్రిభాష’పై తమిళ పార్టీల కన్నెర్ర

రక్షణ బాధ్యతల్లో రాజ్‌నాథ్‌