భూసార మెంతో తేలుతుందిక..

18 Nov, 2019 04:03 IST|Sakshi

15 జిల్లాల్లో 711 మినీ భూసార పరీక్షా కేంద్రాలు

ఫలితాల ఆధారంగానే ఎరువుల పంపిణీ

ఈ కేంద్రాలతో గ్రామీణ యువతకు దొరకనున్న ఉపాధి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 711 మినీ భూసార పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయా లని వ్యవసాయశాఖ నిర్ణయించింది. 15 జిల్లాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో వీటిని నెలకొల్పుతారు. ఎరువుల దుకాణదారులు భూ సార పరీక్షా ఫలితాలు, ఆధార్‌ కార్డుల ఆధారంగానే ఎరువులు విక్రయించాలన్న మార్గదర్శకాల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. భూసార కార్డులను అనుసంధానిత ఎరువుల నిర్వహణ వ్యవస్థ (ఐఎఫ్‌ఎమ్‌ఎస్‌)కు జత చేసేందుకు భూసార వెబ్‌సైట్‌లో రైతుల ఆధార్‌ నంబర్, సర్వే నంబర్లను నమోదు చేస్తారు. ప్రస్తుతం క్లస్టర్ల వారీగా వ్యవసాయ విస్తరణ అధికారులు మట్టి నమూనాలు సేకరించి ఫలితాలను వెబ్‌సైట్‌లో నమోదు చేస్తున్నారు. ఇటీవల వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు సర్వే, రైతు సమన్వయ సమితులు వంటి వాటితో పని ఒత్తిడి పెరిగి, మట్టి నమూనాల సేకరణ మందగించిం ది. రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో 12, వ్యవసాయ మార్కెటింగ్‌లలో 28, సంచార భూసార కేంద్రాలు 4, మినీ భూసార పరీక్షా కేంద్రాలు 2,050 ఉన్నాయి. వాటికితోడు గ్రామస్థాయిలో మరిన్ని రాబోతున్నాయి.

యువతకు ఉపాధి 
కేంద్రం గ్రామీణ యువతకు ఉపాధి కల్పించే పథకంలో భాగంగా 18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల లోపున్న యువకులకు ఈ కేంద్రాలను మం జూరు చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60 నుంచి 40 శాతం చొప్పున నిధులు సమకూర్చుతాయి. యువతకు 75 శాతం సబ్సిడీతో మినీ భూసార కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తున్నారు. మిగతా 25 శాతం లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది. గ్రామ స్థాయిలో సాగయ్యే భూమిలో ఆరున్నర ఎకరాలకు ఒక మట్టి నమూనాను తీసుకోవాల్సి ఉంటుంది.

మినీ భూసార కేంద్రాన్ని ఏర్పా టు చేయాలనుకునే వారు పదో తరగతి పాసై ఉండాలి. రైతులందరికీ భూసార కార్డులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖను ఆదేశించింది. కానీ ఆచరణలో మాత్రం అమలుకావడం లేదన్న ఆరోపణలున్నాయి. 2018–19లో 4,72,987 మట్టి నమూనాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇందులో 4,70,875 ఫలితాల ను పరీక్షించి ఆన్‌లైన్‌ చేశారు. మొత్తం 23,91,395 భూసార కార్డులను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటి లో 10 లక్షల కార్డులు మాత్రమే రైతులకు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

యూపీ మసీదు పేలుడు కేసులో సిటీ డాక్టర్‌

కలెక్టర్‌ మెడకు చుట్టుకుందా?

పీజీ చేరికల్లో ఆమెదే హవా

ఇద్దరి ఉసురు తీసిన రూ.40 వేలు

ప్రారంభమైన ‘ఫాస్టాగ్‌ కార్‌ పార్కింగ్‌’

మూఢ నమ్మకాలు..వన్యప్రాణుల అమ్మకాలు

‘జూన్‌ నాటికి సాగు నీరందించాలి’ 

‘వైద్యులకు అండగా ఉంటాం’

విద్యుత్‌ బిల్లు.. ముందే చెల్లిస్తే రిబేటు! 

‘సబ్బండ వర్గాల మహాదీక్ష’ను భగ్నం చేసిన పోలీసులు

నో షేవ్‌ నవంబర్‌.. ఎలా మొదలైందంటే?

ఆధారాలుంటే జైలుకు పంపండి : ఉత్తమ్‌

పగ పెంచుకుని.. అమ్మను చంపేశారు..

అశ్వత్థామరెడ్డి నిరశన భగ్నం

ఫిట్‌మెంట్‌ పెరెగేది ఎంత?

భార్య టీ పెట్టివ్వ లేదని..

కేసీఆర్‌కు వకాలత్‌ పుచ్చుకున్నారా?: చాడ

నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

‘కొల్లాపూర్‌ రాజా బండారం బయటపెడతా’

తెలంగాణలో భారీగా తహశీల్దార్‌లు బదిలీ

ఈనాటి ముఖ్యాంశాలు

గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపిద్దాం

అశ్వత్థామరెడ్డి నిరాహార దీక్ష భగ్నం

వారి వల్లే మంత్రి అయ్యాను : నిరంజన్‌రెడ్డి

24 మంది చనిపోయినా సీఎం ఇగో తగ్గలేదా?

అద్భుతం ఆవిష్కృతమైంది.. కేటీఆర్‌ ట్వీట్‌

'కేంద్రం వద్ద అటువంటి ప్రతిపాదనేది లేదు'

తల్లి పనిచేసే స్కూల్‌లోనే బలవన్మరణం

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

థాయ్‌కి హాయ్‌

లవ్‌ ఇన్‌ న్యూయార్క్‌

నడిచే నిఘంటువు అక్కినేని

మహానటికి ఆరేళ్లు..!

అమ్మ కోసం మళ్లీ వస్తా: రేఖ...

ఆయన ఎప్పుడూ మన మనస్సులో: చిరంజీవి