ఒకే రోజు 79 పాజిటివ్‌ కేసులు నమోదు

14 Jul, 2020 18:21 IST|Sakshi

సాక్షి: కరీంనగర్‌: నగరంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. మంగళవారం ఒకేరోజు 79 మందికి పాజిటివ్ కేసులు నమోదు కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఆదర్శ నగర్‌కు చెందిన ఓ యువకుడు పాజిటివ్ వచ్చినప్పటికీ నగరంలో యదేచ్చంగా తిరగడం ఆందోళనకు గురిచేస్తోంది.‌ కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి  రోడ్డు మీద తిరిగిన విజువల్స్‌ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీంతో అతను కోవిడ్‌ పేషంట్ కాదని, అతను అంబులెన్సులో తీసుకెళ్లిన వ్యక్తికి పాజిటివ్‌ రావడంతో జూలై 1వ తేదీ నుంచి హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో అతడిలో కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యశాఖకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినప్పటికీ సకాలంలో సిబ్బంది రాకపోవడంతో నడుచుకుంటు ఆసుపత్రికి బయల్దేరినట్లు స్థానికులు వివరించారు. (చదవండి: కరోనాపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు..)

రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న సదరు కరోనా పాజిటివ్‌ వ్యక్తిని గమనించిన మున్సిపల్‌ సిబ్బంది అతన్ని  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు చెప్పారు. దీంతో సమాచారం ఇచ్చిన స్పందించని వైద్య అధికారుల నిర్లక్ష్యానికి ఈ సంఘటన నిలువెత్తు సాక్ష్యమని స్థానిక నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కోవిడ్-19ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా ప్రజలు కరోనా తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలని,  వైద్య పరీక్షలు పెంచాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ కలెక్టర్‌కు సూచించారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరికి కోవిడ్‌ పరీక్షలు చేయించేలా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వివిధ టెస్టింగ్ ల్యాబ్‌లో కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని ఆయన కోరారు. ప్రజలు భయపడకుండా వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. (చదవండి: నిమ్స్‌లో మొదలైన కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌)

మరిన్ని వార్తలు