8న కేసీఆర్ రాక

6 Oct, 2014 03:02 IST|Sakshi
8న కేసీఆర్ రాక

కరీంనగర్ స్పోర్ట్స్:
 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో జిల్లాలో ప్రతిష్టాత్మంగా నిర్వహించనున్న జాతీయస్థాయి ఖోఖో పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ నెల 8 నుంచి 12 వరకు 60వ జాతీయ స్థాయి పాఠశాలల అండర్-14 బాలబాలిక ఖోఖో చాంపియన్‌షిప్ పోటీలు కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ-టెక్నో స్కూల్‌లో నిర్వహిస్తున్నారు. కేసీఆర్ 8న ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి 11.30 గంటలకు కొత్తపల్లికి చేరుకుని పోటీలను ప్రారంభిస్తారని కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టర్ జిల్లాస్థాయి అధికారులతో ఆదివారం కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

బుధవారం ఉదయం సీఎం కరీంనగర్ చేరుకుని నేరుగా ఖోఖో పోటీల ప్రారంభోత్సవానికి వెళ్తారని తెలిపారు. ఈ సందర్భంగా కరీంనగర్ నుంచి కొత్తపల్లి వరకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణ, వైద్యబృందాలు తదితర ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎస్పీ శివకుమార్, ఓఎస్డీ సుబ ్బరాయుడు, కార్పొరేషన్ కమిషనర్ శ్రీకేశ్ లాట్కర్, వివిధ శాఖ ఉన్నతాధికారులు, క్రీడా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.  కాగా కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆగస్టులో జిల్లాకు వచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టరేట్‌లో సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.
 తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న వాటర్‌గ్రిడ్ పథకా న్ని ఇక్కడినుంచే ప్రకటించిన విషయం తెలిసిందే. తిరిగి రెండోసారి కేసీఆర్ జిల్లాకు వస్తున్నారు. ఖోఖో పోటీల ప్రారంభోత్సవం తర్వాత.. అదే రోజు ఆదిలాబాద్ జిల్లాలో జరగనున్న గిరి జన పోరాట యోధుడు కొమురం భీమ్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లనున్నారు.



 

>
మరిన్ని వార్తలు