గంజాయి ముఠా గుట్టురట్టు

16 Jan, 2016 20:29 IST|Sakshi

చంద్రాయణగుట్ట (హైదరాబాద్) : గంజాయి రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముగ్గురు నిందితులను శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ ప్రాంతానికి చెందిన రవి కుమార్ (24) గత కొన్నాళ్లుగా వైజాగ్, చింతపల్లి, పాడేరు తదితర ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని కిలో రూ.2500-3000లకు కొనుగోలు చేసి హైదరాబాద్ మీదుగా హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ లాంటి ప్రాంతాలకు తరలిస్తున్నాడు. కిలో గంజాయిని రూ.5000- 6000లకు విక్రయించేవాడు. వాసన రాకుండా ఉండేందుకు గంజాయిని ఎయిర్‌ ప్యాక్ చేసి ట్రావెలింగ్ బ్యాగ్‌లలో బస్సులలో, రైళ్లల్లో సరఫరా చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ నెల 12వ తేదీన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో గుంటూరుకు చెందిన ఇ.యశోదమ్మ అనే మహిళ 30 కిలోల గంజాయిని బ్రోకర్‌కు అందజేస్తున్న క్రమంలో దక్షిణ మండలం పోలీసులకు చిక్కింది. ఆమెను అదుపులోకి తీసుకొని విచారించడంతో ఈ ముఠా విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నిఘా ఉంచిన దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం ఈ ముఠాను పట్టుకున్నారు. రవి కుమార్, రాకేష్ వర్మ, మహ్మద్ ఇబ్రహీంలను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి ఏడు బ్యాగ్‌లలో ఉన్న 80 కిలోల గంజాయి, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు