టీఎస్‌ లాసెట్‌ 2017కు 85.65% హాజరు

28 May, 2017 02:31 IST|Sakshi

30న ప్రిలిమినరీ ‘కీ’ విడుదల

కేయూ క్యాంపస్‌:  రాష్ట్రంలో శనివారం నిర్వహించిన టీఎస్‌ లాసెట్‌ ప్రశాంతంగా ముగిసింది. మొత్తంగా 24,858 మంది విద్యార్థులకుగాను 21,203 మంది (85.65శాతం) హాజరయ్యారు. రాష్ట్రంలో 12 రీజినల్‌ సెంటర్ల పరిధిలో మొత్తంగా 51 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిమిషం నిబంధనతో అక్కడక్కడ అభ్యర్థులు ఉరుకులు పరుగుల మీద పరీక్షా కేంద్రా లకు చేరుకున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతించలేదు.

హన్మకొండలోని వర్సిటీ లా కళాశాలలో ఆయా కోర్సుల ప్రవేశాల ప్రశ్నపత్రాల సెట్‌లను ఉదయం 6 గంటలకు కేయూ వీసీ ప్రొఫెసర్‌ ఆర్‌. సాయన్న ఎంపిక చేశారు. ప్రతి కోర్సుకు రెండు ప్రశ్నపత్రాల సెట్‌లలో లాటరీ పద్ధతి ద్వారా ఒక సెట్‌ను ఎంపిక చేశారు. ఈనెల 30న ప్రిలిమినరీ కీ విడుదల చేయనున్నట్టు లాసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఎంవీ రంగారావు వెల్లడించారు. జూన్‌ 2 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని, జూన్‌ 10న ఫలితాలు విడుదల చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు