87 సివిల్‌ జడ్జి పోస్టులకు నోటిఫికేషన్‌

21 Feb, 2020 02:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సివిల్‌ జడ్జి పోస్టుల భర్తీకి హైకోర్టు గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 87 పోస్టులకు నోటిఫికేషన్‌ వెలువడగా.. అందులో 70 పోస్టులు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేస్తారు. వీటిలో 31 పోస్టులను ఓపెన్‌ కేటగిరీకి కేటాయించగా.. అందులో 11 పోస్టులు మహిళలకు ఇచ్చారు. దివ్యాంగులకు (ఓపెన్‌ కేటగిరి)–1, బీసీ–ఎ 6 (మహిళలకు 2), బీసీ–బీ 8 (మహిళలకు 4), బీసీ–సీ 1, బీసీ–డీ 5 (మహిళలకు 2), బీసీ–ఇ 3 (మహిళలకు 1), ఎస్సీలకు 10 (మహిళలకు 3), ఎస్టీలకు 5 (మహిళలకు 3) పోస్టులు ఖరారు చేశారు. మిగిలిన 17 పోస్టులను బదిలీల ద్వారా భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు న్యాయవాదిగా మూడేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలన్న నిబంధనను ఈసారి సడలించారు. తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌  ్టటజిఛి. జౌఠి. జీn ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు