గుప్త నిధుల తవ్వకాలు: 9 మంది అరెస్టు

24 Sep, 2015 11:58 IST|Sakshi

తుర్కయాంజల్: గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ ఏవీనగర్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో కొందరు వ్యక్తులు ముప్పై అడుగుల లోతైన గుంతను తవ్వారు. అక్కడ పూజలు చేసిన ఆనవాళ్లు ఉండటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు తవ్వకాలు జరుపుతున్న 9 మందిని అదుపులోకి తీసుకుని, ఒక ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. అయితే, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకే గుంతను తవ్వుతున్నట్టు నిందితులు చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు