90 అడుగుల కన్యకా పరమేశ్వరి 

7 Jan, 2019 02:23 IST|Sakshi

ఫిబ్రవరి 14న పెనుగొండలో ప్రతిష్టాపన 

హైదరాబాద్‌: పంచలోహాలతో 90 అడుగుల ఎత్తుతో రూపొందించిన కన్యకా పరమేశ్వరి విగ్రహాన్ని ఫిబ్రవరి 14న పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ క్షేత్రంలో ప్రతిష్టించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ట్రస్ట్‌ అధ్యక్షుడు డాక్టర్‌ పీఎన్‌ గోవిందరాజులు, వెండి రథం కమిటీ చైర్మన్‌ రామ్‌పండుతో కలసి తమిళనాడు మాజీ గవర్నర్, శ్రీ వాసవీ పెనుగొండ ట్రస్ట్‌ ప్యాట్రన్‌ కె.రోశయ్య కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ..ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వాసవీ కన్యకా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్టాపనతో పెను గొండ వీధులు భక్తి పారవశ్యంతో విరాజిల్లనున్నాయన్నారు. పెనుగొండ క్షేత్రంలో గొప్ప కార్యక్రమం జరుగుతుందని, ఆలయ అభివృద్ధి, ప్రాజెక్టు వ్యయం రూ.45 కోట్లు కాగా, విగ్రహ ఏర్పాటుకు రూ.17 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు.  

మరిన్ని వార్తలు