సాగు.. బాగు 

4 Apr, 2019 02:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వర్షాభావ పరిస్థితుల్లోనూ రబీలో ఆహార ధాన్యాల సాగు ఆశాజనకంగా ఉంది. అందులో వరి నాట్లు కూడా లక్ష్యాన్ని చేరుకున్నాయని వ్యవసాయ శాఖ పేర్కొంది. రబీలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 33.45 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 29.67 లక్షల (89%) ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయ శాఖ బుధవారం సర్కారుకు పంపిన నివేదికలో వెల్లడించింది. అందులో ఆహారధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 26.12 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 24.65 లక్షల (94%) ఎకరాల్లో సాగైనట్లు తెలిపింది.

ఆహారధాన్యాల సాగులో కీలకమైన వరి సాధారణ సాగు విస్తీర్ణం రబీలో 17.65 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 17.50 లక్షల (99%) ఎకరాల్లో నాట్లు పడ్డాయి. అలాగే మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 4.15 లక్షల ఎకరాలు కాగా, 3.22 లక్షల (78%) సాగైంది. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 3.12 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు అత్యధికంగా 3.25 లక్షల (104%) ఎకరాల్లో సాగయ్యాయి. అందులో శనగ సాగు 117 శాతం సాగైంది. నూనె గింజల సాధారణ సాగు విస్తీర్ణం 4.47 లక్షల ఎకరాలు కాగా, 3.27 లక్షల (73%) ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయ శాఖ తెలిపింది.  

తీవ్ర వర్షాభావం... 
జనవరిలో విస్తృతంగా వర్షాలు కురిసినా.. ఫిబ్రవరి, మార్చి నెలల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తం 16 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటడంతో అనేక చోట్ల పంటలు ఎండుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, నిర్మల్, జనగాం, కరీంనగర్, మహబూబాబాద్‌ జిల్లాల్లో మొక్కజొన్న కోత దశలో ఉన్నప్పటికీ కత్తెర పురుగు సోకి దిగుబడి పడిపోయే పరిస్థితి నెలకొందని నివేదిక వెల్లడించింది. పలు చోట్ల శనగ, పెసర, మినుములు, వేరుశనగ పంటలు కోత దశలో ఉన్నాయి. మిర్చి నాలుగో తీత దశలో ఉంది.  

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కవిత భారీ వెనుకంజ.. షాక్‌లో టీఆర్‌ఎస్‌!

మల్కాజ్‌గిరిలో రేవంత్‌ విజయం

కరీనంగర్‌లో బండి సంజయ్‌ భారీ విజయం

భువనగిరిలో కోమటిరెడ్డి గెలుపు

వైఎస్‌ జగన్‌కు కేసీఆర్‌ అభినందనలు

తెలంగాణ లోక్‌ సభ : వారేవా బీజేపీ

ట్రాలీల్లేక తిప్పలు!

‘ఆమె’కు ఆమే భద్రత

రక్తనిధి ఖాళీ

మధుర ఫలం.. విషతుల్యం

నీరొక్కటే చాలదు సుమా..!

గొంతులో ఇరికిన ఎముక..

తెలంగాణ లోక్‌సభ: రేవంత్‌ విజయం

రానున్న మూడ్రోజులు తేలికపాటి వర్షాలు

ఒక్కో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో రీపోలింగ్‌

‘పిల్ల కాల్వ’ల కళకళ! 

మైనంపల్లికి త్రుటిలోతప్పిన ప్రమాదం

మరికొద్ది గంటల్లో!

సరుకు లేకుండానే రూ.133 కోట్ల వ్యాపారం

డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

ఏ నిమిషానికి ఏమి జరుగునో?

ఆఖరి వరకు అప్రమత్తంగా ఉండాలి

ప్రయాణికులకు బోగిభాగ్యం

సోయా విత్తనోత్పత్తిలో కంపెనీల మోసం

తెలంగాణలో ఆర్థిక సంక్షోభం:రాకేశ్‌రెడ్డి

పోలీసులు అరెస్ట్‌ చేస్తారని.. గోడ దూకి పారిపోయా

పార్టీ ఫిరాయింపుల వెనక తాయిలాలు

ఈడీ దర్యాప్తుపై జోక్యం చేసుకోలేం

ఎన్నికల నిలుపుదల సాధ్యం కాదు

కాబోయే పోలీసులకు కొత్త పాఠాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మా నాన్నకి గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాను

అంజలి చాలా నేర్పించింది!

ఆ లోటుని మా సినిమా భర్తీ చేస్తుంది

ఆడియన్స్‌ క్లాప్స్‌ కొడతారు

చలో చెన్నై

‘విజయగర్వం నా తలకెక్కింది’