శంషాబాద్‌లో ప్రత్యేక సేవలు

8 Apr, 2020 04:29 IST|Sakshi
మంగళవారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అమెరికన్లకు థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్న సిబ్బంది

అత్యవసర సేవలందిస్తున్న శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌

అమెరికాకు ఎయిర్‌ ఇండియా స్పెషల్‌ ఫ్లైట్‌

99 మంది అమెరికన్ల తరలింపు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా సృష్టిస్తోన్న విపత్కర పరిస్థితుల్లోనూ శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రత్యేక సేవలను అందజేస్తోంది. వివిధ ప్రాంతాలకు నిత్యావసర వస్తువులను సరఫరా చే యడంతో పాటు హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికులను వారి దేశాలకు చేరవేస్తోంది. లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే దేశీయ విమానాల రాకపోకలకు సైతం ఎయిర్‌పోర్టు పూర్తిగా సన్నద్ధమైంది. ఈదిశగా ఇప్పటికే పలు ఎయిర్‌లైన్స్‌ దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య విమాన సర్వీసులను నడిపేందుకు బుకింగ్‌ సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్‌ టు అమెరికా..
లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన 99 మంది అమెరికన్లను తీసుకుని ప్రత్యేక విమానం మంగళవారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరింది. అమెరికా కాన్సులేట్, తెలంగాణ ప్రభుత్వం సమన్వయంతో దీనిని ఏర్పాటు చేశారు. ఎయిర్‌ ఇండియాకు చెందిన ఏఐ 1617–ఏ–320 విమానం ముంబై నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3.20కి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. 99  మంది ప్రయాణికులకు థర్మల్‌ పరీక్షలు, ఇమిగ్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసి విమానంలోకి పంపారు.4.15 గంటలకు ఇక్కడి నుంచి తిరిగి ముంబైకి బయల్దేరింది. అక్కడున్న మరికొందరు ప్రయాణికులతో  అమెరికాకు వెళ్లనుంది.

ప్రత్యేక సేవల్లో ఎయిర్‌పోర్టు
12ఏళ్ల పాటు నిరంతరాయంగా సేవలందిస్తోన్న  హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం మొట్టమొదటిసారి లాక్‌డౌన్‌ కారణంగా సాధారణ సేవలను నిలిపివేసింది. కానీ కార్గో సేవలు కొనసాగుతున్నాయి. మార్చి 31న ఎయిరిండియా ప్రత్యేక విమానం ద్వారా 38 మంది జర్మన్లను వారి స్వదేశానికి తరలించారు. మార్చి 28న ఇండిగోకు చెందిన ప్రత్యేక మెడికల్‌ ఎవాక్యుకేషన్‌ విమానం హైదరాబాద్‌లో దిగి, తన ఎనిమిది మంది సిబ్బందిని హైద రాబాద్‌లో దింపి, ఇక్కడ చిక్కుకుపోయిన ఐదుగు రు సిబ్బందితో చెన్నైకు వెళ్లింది. ఫార్మా, ఔషధాలు, ఇతర అత్యవసర సేవలను ఎయిర్‌పోర్టు కొనసాగిస్తోందని విమానాశ్రయ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు