హైదరాబాద్‌లో భారీ వర్షం

23 Jul, 2020 08:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారీ వర్షంతో హైదరాబాద్‌ తడిసి ముద్దయింది. నగరంలో పలు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజాము నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, కూకట్‌పల్లి, కోఠి, అబిడ్స్‌, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీ నగర్‌, కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల, గాజుల రామారం, సూరారం, ముషీరాబాద్‌,ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, అశోక్‌నగర్‌, ట్యాంక్‌బండ్‌,నాంపల్లి, దారుసలం సహా పలు చోట్ల భారీ వర్షం పడింది. పలు చోట్ల భారీగా వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది.

ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది
ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో వర్షపు నీరు భారీగా రోడ్ల మీదికి చేరుతుంది. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ సిబ్బంది వర్షపు నీరు వెళ్లేందుకు మాన్యువల్స్ వద్ద మరమ్మతులను నిర్వహిస్తున్నారు. కంటోన్మెంట్ బోయినపల్లి, సికింద్రాబాద్ వారసిగూడ, బేగంపేట్ తదితర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరుకుంది. భారీ వర్షానికి అంబర్‌పేట్‌- ముసరాంబాగ్ వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. 

మరిన్ని వార్తలు