కూతురి పెళ్లి కోసం దొంగగా మారాడు..

5 May, 2015 09:47 IST|Sakshi
కూతురి పెళ్లి కోసం దొంగగా మారాడు..
  • దొంగగా అవతారమెత్తిన ఓ తండ్రి
  • బీపీఎంను బెదిరించి పింఛన్లసొమ్మును లాక్కెళ్లాడు
  • పిస్టల్, బుల్లెట్స్, నగదు స్వాధీనం

  • మహబూబ్‌నగర్ క్రైం: తనకూతురి పెళ్లి కోసం ఓ తండ్రి దొంగగా మారాడు. కట్నం కింద ఇవ్వాల్సిన డబ్బును ఎలాగైనా సంపాదించాలన్న దురాశతో స్నేహితుడితో కలిసి దారిదోపిడీకి పాల్పడ్డాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. వివరాలను ఎస్పీ పి.విశ్వప్రసాద్ సోమవారం తన కార్యాలయంలో వెల్లడించారు. వనపర్తి మండలం మెటిపల్లితండాకు చెందిన కేతావత్ శంకర్‌నాయక్ తాపీమేస్త్రీ. బతుకుదెరువు కోసం కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. అతడికి పెళ్లీడుకు వచ్చిన ఓ కూ తురు ఉంది. కూలీడబ్బులు పూట గడవడానికే సరిపోవడం లేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో అధికమొత్తం లో సంపాదించి..కుమార్తె పెళ్లి జరిపించా లని ఆశపడ్డాడు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లో ఉన్న  బీహార్‌కు చెందిన పప్పు అనే మిత్రుడికి చెప్పి విలపించాడు.

    కూలీ చేసి పెళ్లి చేయలేవని.. ఏదైనా దొంగతనం చేస్తే  వివాహం చేయగలుగుతామని సలహా ఇచ్చాడు. దీంతో శంకర్‌నాయక్ దృష్టి దొంగతనాల వైపునకు మళ్లింది. ఇద్దరు కలిసి నాలుగునెలల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి వెళ్లి అక్కడ రూ.27వేలతో ఓ పిస్తోలును కొనుగోలుచేశారు. అనంతరం హైదరాబాద్ వచ్చిన శంకర్‌నాయక్ డబ్బు సంపాదించేందుకు పథకం రచించాడు. ఈ క్రమంలో తన స్నేహితుడు, వనపర్తి మండలంలోని ఖాసీంనగర్ గ్రామానికి చెందిన కాట్రావత్ నాగరాజుతో కలి శాడు. అతడికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో ఇద్దరి ఆలోచనలు కార్యరూపం దాల్చాయి.

    దారిదోపిడీలే లక్ష్యం
     పథకంలో భాగంగా గతమార్చి 26వ తేదీన ఆసరా పింఛన్లకు సంబంధించిన రూ.1.50లక్షలను పంపిణీ చేసేందుకు బ్రాంచ్ పోస్టుమాస్టర్ శిరీష తన సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి ఓ వాహనంలో ఖాసీంనగర్ గ్రామానికి వెళ్తుం డగా అప్పటికే కాపుగాసిన శంకర్‌నాయక్ వారిని బెదిరించాడు. ఇంతలో ఆమె చేతిలో ఉన్న బ్యాగును లాగేందుకు య త్నించగా తిరగబడటంతో గాల్లోకి కా ల్పులు జరిపి స్నేహితుడిలో కలిసి ఉడాయించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు వనపర్తి పోలీసులు కేసుదర్యాప్తు చేపట్టారు. బాధితుడు చంద్రశేఖర్‌రెడ్డి ఇచ్చి న సమాచారంతో పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు.

    చివరికి శంకర్‌నాయక్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో వారిని అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. వారినుంచి రూ.87వేల నగదుతో పాటు ఓ పిస్టల్, మూడు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదించడంతో పోలీసుల కృషిని ఎస్పీ ప్రశంసించారు. అనంతరం ఐడీ పార్టీకి చెందిన శ్రీనివాస్‌రావు, రాయుడులకు నగదు పారితోషికాన్ని అందజేశారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ మల్లారెడ్డి, డీఎస్పీ చెన్నయ్య, సీఐలు షాకీర్‌హుస్సేన్, కిషన్, గోపాల్‌పేట ఎస్‌ఐ సైదులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు