ఆడుకునే వయసు.. కదల్లేని తనువు

25 Jun, 2015 09:40 IST|Sakshi
ఆడుకునే వయసు.. కదల్లేని తనువు

అది నిరుపేద కుటుంబమే అయినా.. సంతోషాల పొదరిల్లు. కూలీనాలీ చేస్తే తప్ప పూటగడవ కున్నా.. పిల్లల కేరింతల్లోనే కష్టాలను మర్చిపోయేవారు ఆ దంపతులు. కానీ ఆ ఆనందాలు ఇప్పుడు లేవు. ఆ కష్టాలూ రెట్టింపయ్యాయి. కారణం.. తమ ఇంటి వెలుగు అవుతాడనుకున్న కుమారుడిని నానాటికీ వ్యాధి కబలిస్తుండడం.
 
బాలుడిని వెంటాడుతున్న వ్యాధి
చికిత్స చేయించలేని పేదరికం
ఆపన్నహస్తం కోసం నిరీక్షణ

 
మహబూబాబాద్: పట్టణ శివారులోని ధర్మన్నకాలనీకి చెందిన చిన్న యూకయ్య- ఎలేంద్ర దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కూలీ పనులతోనే కుటుంబాన్ని పోషిస్తున్నారీ దంపతులు. వీరి రెండో కుమారుడు కేశవకుమార్ బాల్యంలో హుషారుగా ఉండేవాడు. సరిగ్గా ఏడాది వయస్సు వచ్చేసరికి బాలుడి కాళ్లు చచ్చుబడిపోయాయి. చేతులూ చలనం కోల్పోయాయి. కేరింతలు కొట్టే బిడ్డా ఇలా మారేసరికి తల్లిదండ్రులకూ కాళ్లూచేతు లు ఆడలేదు. స్థానిక ఏరియూ ఆస్పత్రిలో చేర్పించినా.. అక్క డి మందులతో నయం కాలేదు. హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. కానీ వీరి వద్ద చిల్లిగవ్వ లేకుండాపోయింది. తమ దురదృష్టానికి కుమిలిపోతూ ఇంటి వద్దే బాలుడికి సపర్యలు చేస్తోంది తల్లి ఎలేంద్ర. ఇప్పుడా బాలుడి వయస్సు 14 ఏళ్లు.
 
తిరుపతి తీసుకెళ్లినా..
రోజూ తల్లితోడు లేనిదే కేశవకుమార్ దినచర్య సాగదు. ఇలా తాను కూలీ పనులకూ దూరమవడం ఇంటి పోషణపై భారమవుతోందని నాయనమ్మకు బాలుడి బాధ్యత అప్పగించారు. ఆర్నెల్ల క్రితం తిరుపతిలో ఉచితంగా చికిత్స చేస్తారని తెలిసి బాలుడిని అక్కడి ఆస్పత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. వైద్యులు చికిత్స అందించినా బాలుడికి నయం కాలేదు. పలు వైద్య పరీక్షలు నిర్వహిం చాక వచ్చిన రిపోర్టుల ఆధారంగా చికిత్స చేయిస్తే నయమవుతుందని వైద్యులు చెప్పారు. ఆ పరీక్షలు చేయించే స్థోమత లేక తల్లిదండ్రులు వెనుదిరి గారు. కానీ బాలుడు నేటికీ నరకయూతన అనుభవిస్తున్నాడు.
 
తన ఈడు పిల్లలు ఆడుకోవడాన్ని చూసి తనకెందుకీ కష్టమంటూ కంటతడి పెడుతున్నా డు. తన బాల్యాన్ని ఇలా కుర్చీలో బందీ కాకుం డా చూడాలని వేడుకుంటున్నాడు. ఎందరో దయూర్థులు న్న ఈ సమాజమే తమ బిడ్డను మామూలు మనిషిగా మార్చుతుందని తల్లిదండ్రులూ నమ్ముతున్నారు. బాలుడికి చేయూత ఇవ్వాలనుకునేవారు 96527 03888 నం బర్‌లో సంప్రదించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు