రిటెయిలర్ మార్కెట్‌కూ ఓ విధానం

3 Jan, 2015 01:12 IST|Sakshi
రిటెయిలర్ మార్కెట్‌కూ ఓ విధానం
  • ముఖ్యమంత్రి కేసీఆర్
  • సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రిటెయిలర్ మార్కెట్ విధానాన్ని ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. శుక్రవారం సచివాలయంలో రిటెయిల్ మార్కెట్ ప్రతినిధులు.. కబీర్(లైఫ్‌స్టైల్), వేణుగోపాల్ (రిలయన్స్),  మురళి(వాల్‌మార్ట్), రవీందర్ (షాపర్స్‌స్టాప్), రాకేష్(బిగ్‌బజార్), మరికొం దరు అసోసియేషన్ ప్రతినిధులు సీఎంను కలి శారు. తెలంగాణలో రిటెయిల్ మాల్స్‌ను విస్తరించనున్నట్లు సీఎం దృష్టికి తీసుకువచ్చారు.    

    365 రోజులపాటు తమ మాల్స్ తెరిచి ఉంచేలా అనుమతించడంతోపాటు, ఒకచోట లెసైన్స్ పొందిన సంస్థ అనుబంధ శాఖలను అదే లెసైన్స్‌పై ఏర్పాటు చేసుకోవడానికి వీలుకల్పించాలని, రాత్రివేళల్లో మహిళా ఉద్యోగులు పనిచేయడానికి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రిని కోరారు. వీటిపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు స్పందిస్తూ మాల్స్ ఉద్యోగులకు వారానికి ఒక  సెలవు ఇవ్వాలని, రాత్రివేళ్లల్లో విధులు నిర్వహించే మహిళల భద్రతకు చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. మాల్స్ ఏర్పాటు అభివృద్ధికి ఓ సూచిక అని అన్నారు. మాల్స్, రిటెయిల్ షాపింగ్ సెంటర్ల ఏర్పాటు, నిర్వహణకు  ఓ విధానం తీసుకుని రావాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని సీఎం వివరించారు.
     

మరిన్ని వార్తలు