తెలంగాణ చరిత్రకు అరుదైన అవకాశం

29 May, 2016 02:14 IST|Sakshi
తెలంగాణ చరిత్రకు అరుదైన అవకాశం

సెంట్రల్ యూనివర్సిటీలో చేర్చేందుకు కోదండరాం హామీ

భీమదేవరపల్లి:  భీమదేవరపల్లి తెలంగాణ చరిత్రకు అరుదైన అవకాశం దక్కింది. సెంట్రల్ యూనివర్సిటీలో ఈ చరిత్ర పుస్తకా న్ని భద్రపర్చేందుకు అవకాశం కల్పించేందుకు కృషిచేస్తానని ప్రొఫెసర్ కోదండరాం హామీఇచ్చారు. భీమదేవరపల్లి తెలంగాణ చరిత్రను స్థానిక జేఏసీ నాయకులు 350 పేజీలతో ఒక పుస్తకం రూపంలో తీసుకొచ్చారు. దానికి ముందు మాట రాయడానికి మండల జేఏసీ చైర్మన్ డ్యాగల సారయ్య, జిల్లా కో చైర్మన్ చెప్యాల ప్రభాకర్, పుస్తక రచయిత ఏరుకొండ నర్సింహాస్వామి తదితరులు ప్రొఫెసర్ కోదండరాం, పిట్ట ల రవీందర్, దేశపతి శ్రీనివాస్‌ను కలిశారు.

ఈ పుస్తకాన్ని పరిశీలించిన కోదండరాం ఆశ్చర్యానికి గురయ్యూరు. ఈ చరిత్రను సెంట్రల్ యూనివర్సిటీలో భద్రపర్చుతామన్నారు. జూన్ 3న జరగనున్న యూనివర్సిటీ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. ఈ పుస్తకాన్ని త్వరలో కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్లు తెలిసింది.
 

మరిన్ని వార్తలు