త్యాగానికి ప్రతిరూపం బక్రీద్

5 Oct, 2014 23:54 IST|Sakshi

బక్రీద్ వేడుకల కోసం ముస్లింలు సిద్ధమయ్యారు. సోమవారం జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్నారు. దీనికోసం అవసరమైన ఇప్పటికే షాపింగ్‌ను పూర్తి చేశారు. చిన్నాపెద్దా తేడాలేకుండా జరుపుకునే పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

ఈ సందర్భంగా పట్టణంలోని మెదక్ రోడ్ సమీపంలో గల ఈద్గా మైదానాన్ని నమాజ్‌ల కోసం సిద్ధం చేశారు. 60 ఏళ్ల క్రితం నిర్మించిన తంజిముల్ మసీదును అందంగా ముస్తాబు చేశారు. పండుగను పురస్కరించుకుని పలు చోట్ల అన్నదానం, వస్తుదానం, వస్త్రదానం చేస్తారు.

 చరిత్ర...
 ఐదు వేల సంవత్సరాల క్రితం ఇరాక్ ప్రాంతాన్ని పాలిస్తున్న సమ్రూద్ రాజ్యంలో.. హజ్రత్ ఇబ్రహీం అనే వ్యక్తి దైవ ప్రచారం నిర్వహిస్తూ.. ప్రజల్లోని అజ్ఞానాన్ని, మూఢనమ్మకాలను తొలగించేందుకు ప్రయత్నిస్తుండగా రాజ్య బహిష్కరణకు గురయ్యాడని చరిత్ర చెబుతోంది. అనంతరం వేరే రాజ్యానికి వెళ్లిన ఇబ్రహీం దైవ సంకల్పాన్ని కొనసాగించారని ముస్లిం పెద్దలు పేర్కొంటున్నారు. ఇలా ఏళ్లకు ఏళ్లు కాల గర్భంలో కలిసి పోవడంతో ఆయనకు వృద్ధాప్యం వచ్చింది.

ఈ సమయంలో ఒక రోజు రాత్రి ఇబ్రహీం పడుకుని ఉండగా అల్లా తన కలలోకి వచ్చి నీ కుమారుడిని నాకు బలివ్వమని (ఖుర్బానీ) కోరుతాడు. దైవ సంకల్పాన్ని నెరవేర్చేందుకు ఇబ్రహీం తన కొడుకును బలిచ్చేందుకు సిద్ధమైన క్షణంలో.. అతని దైవ నిరతికి ముగ్దుడైన అల్లా ప్రత్యక్షమై తన కుమారుడి స్థానంలో పొట్టేలును ఖుర్బానీగా స్వీకరిస్తాడని చరిత్ర చెబుతోంది. ఈ సంఘటనకు గుర్తుగా ముస్లింలు బక్రీద్‌ను జరుపుకుంటారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా