ఆటోమొబైల్‌ రంగంపై ప్రత్యేక దృష్టి

20 Dec, 2016 02:29 IST|Sakshi
ఆటోమొబైల్‌ రంగంపై ప్రత్యేక దృష్టి

శాసనమండలిలో మంత్రి కేటీఆర్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం ఆటోమొబైల్‌ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఖమ్మం, కామారెడ్డి, మిర్యాలగూడ, మంచిర్యాల, కరీంనగర్, రామగుండంలలో ఆటోనగర్‌లను ప్రతిపాదించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అశోక్‌ లేల్యాండ్‌ కంపెనీ బస్‌బాడీ యూనిట్‌ ఏర్పాటు కోసం   ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుందన్నారు. హైదరాబాద్‌–వరంగల్‌ పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధిలో భాగంగా భువనగిరి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, మణికొండ, శాయంపేట– సంగెంలలో క్లస్టర్ల ఏర్పాటుకు నిర్ణయించామని చెప్పారు.

మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి సుల్తాన్‌పూర్‌లో 50ఎకరాలు కేటాయించామని, వారికి 30 శాతం రాయితీతో భూమిని కేటాయిస్తామని వెల్లడించారు. త్వరలోనే ప్లాస్టిక్‌ సిటీ ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. సోమ వారం శాసనమండలిలో టీఎస్‌ ఐపాస్, సులభతర వ్యాపార విధానంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో కేటీఆర్‌ మాట్లాడారు.  రానున్న రోజుల్లో ‘కాస్ట్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్, క్వాలి టీ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’లపై దృష్టి పెట్ట నున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబ డులను రాష్ట్రానికి ఆకర్షించే లక్ష్యంతో నవం బర్‌లో హైదరాబాద్‌లో ప్రపంచ పెట్టుబడి దారుల సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.

 రాష్ట్రంలో టీఎస్‌ ఐపాస్‌ను ప్రవేశపెట్టాక ఇప్పటివరకు రూ.49,463 కోట్ల పెట్టుబడితో కూడిన 2,929 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చినట్లు కేటీఆర్‌ చెప్పారు. వాటి ద్వారా ప్రత్యక్షంగా 1,95,290 మందికి, పరోక్షంగా మరో మూడు లక్షల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. ప్రపంచస్థాయి కంపె నీలైన గూగుల్, ఆపిల్, ఫేస్‌బుక్, అమెజాన్‌లు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కార్యాలSయా లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయన్నారు. పారిశ్రామిక విధానంలో యువ పారిశ్రామికవేత్తలకు ఎంత కోటా కేటాయించారని,  తెలంగాణ పారిశ్రా మిక వేత్తలు ఎంత మంది ఉన్నారని విపక్షనేత షబ్బీర్‌ అలీ మండలిలోప్రశ్నించారు.

>
మరిన్ని వార్తలు