మొక్క బతికేదెలా!!

24 Jul, 2015 04:12 IST|Sakshi
మొక్క బతికేదెలా!!

♦ మొక్కుబడిగా మారిన హరితహారం
♦ వర్షాభావ పరిస్థితులే ఇందుకు కారణం
♦ సంరక్షణకు ముందుకు రాని సర్పంచులు
♦ ఆలోచనలో పడిపోరుున అధికారులు
♦ మొక్కల పంపిణీకి తాత్కాలిక విరామం
♦ వనరులను వెతుకుతున్న వ్యవసాయ శాఖ
 
 బాన్సువాడ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం వర్షాభావ పరిస్థితులతో మొక్కుబడిగా మారింది. గ్రామాలలో మొక్కలను నాటేందుకు సర్పంచులు అం తగా ముందుకు రాకపోవడంతో మొక్కలు నర్సరీలలోనే ఉండిపోతున్నాయి. సకాలంలో వానలు కురియకపోవడమే ఇందుకు కారణం. జిల్లాలో హరితహారం ఈ నెల మూడున ప్రారంభమైంది. సుమారు 3.60 కోట్ల మొక్కలను నాటాలని అధికారులు నిర్ణయించా రు. దీనికోసం అన్ని మండలాలలోని నర్సరీలలో మొక్కలను పెంచారు. ఒక్కొక్క గ్రామంలో 40 వేల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ధేశించారు.

ఇలా ఒక్కొక్క నియోజకవర్గానికి 40 లక్షల మొక్కలను నాటాలని నిర్ణయించారు. అందుకు అన్ని ప్ర భుత్వ/ప్రరుువేటు సంస్థలు, విద్యాలయాలు, అధికారులను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాలలో కమిటీలను ఏ ర్పాటు చేసి, పంచడానికి మొక్కలను సిద్ధంగా ఉంచారు. మొక్కల పంపిణీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీఓలకు ఇప్పటికే ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయి. సంరక్షణ వనరులు, వసతు లు తెలుసుకొని సంతృప్తి చెందితేనే మొక్కలు అం  దించాలని వారికి సూచించారు. తీసుకుపోయిన మొక్కలపై శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.

 జాడలేని వానలు
 జూన్ నెలలో అడపాదడపా వర్షాలు కురియడం   తో, జూలైలోనూ వర్షం కురుస్తుందని ప్రభుత్వం భావించి హరితహారాన్ని ప్రారంభించింది. కానీ ఆశించిన స్థారుులో వానలు కురియలేదు. ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 20 లక్షల మొక్కలను నాటామని అధికార యంత్రాంగం పేర్కొంటోం    ది. ఇందులో చాలా మొక్కలు ఇప్పటికే వర్షాభావంతో వాడిపోతున్నాయి. పాఠశాలలు, కార్యాలయాలలో నాటిన మొక్కలకు సంరక్షణ చర్యలు చేపడుతున్నా మిగితా ప్రాంతాలలో నాటినవాటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

వర్షాభావం, పంచాయతీ సిబ్బంది సమ్మెతో వాటిని సంరక్షించలేకపోతున్నామని సర్పంచులు అంటున్నారు. ఈ  దురు గాలులు, ఎండలతో చాలా వర కు భూమిలో తేమ లేకుండా పోతోంది. ఇది   లా ఉండగా, వర్షాభావ పరిస్థితులతో వ్య వసాయ శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ఆలోచనలో పడింది. జిల్లాలో పలు చోట్ల వే సిన మెట్ట పంటలు ఎండిపోతున్నారుు. ప్రతికూల పరిస్థితులలో వ్యవసాయదారులు పంటల సాగుకు ముందుకు రావడం లేదు. ఇక హరితహారం పరిస్థితి చెప్పలేకుండా ఉన్నామని,  మొక్కలను నాటితే వాటిని బతికించడం కష్టమేనని వ్యవసాయ అధికారులు అంటున్నారు.

 ఎండుతున్న మొక్కలు
 పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ రహదారుల వెంట నాటిన మొక్కలకు నీళ్లు పోయకుంటే అవి ఎండిపోయే ప్రమాదముంది. ప్రస్తుతం మొక్కను సంరక్షించే చర్యలు పకడ్బందీగా చేపట్టడం లేదు. జిల్లా లో వర్షాభావ పరిస్థితి అధికంగా ఉంది. ప్రస్తుత సమయంలో మొక్కలు నాటితే చ నిపోయే పరిస్థతి ఉన్నందున నీటిసౌకర్యం ఉంటే నే మొక్కలు నాటాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సర్పంచులు కూడా గ్రామాలకు మొక్కలను తీసుకుపోయేందుకు ముందుకు రావడం లేదు.

బాన్సువాడ పట్టణంలో నేటికీ వెయ్యి మొక్కలను కూడా నాటలేదు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. అధికారులు కూడా అడిగిన వారందరికీ మొక్కలు ఇవ్వకుండా వాటిని బతికించే వనరుల  ను చూస్తున్నారు. జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. లక్ష్యాలు ముఖ్యం కాదు మొక్క బతకడమే ప్రధానమంటూ ఉన్నతాధికారులు సూచించడంతో మొక్కలు నాటే కార్యక్రమానికి తాత్కాలిక విరామం ఏర్పడింది. ఫలితంగా నర్సరీలలోని మొక్కలు నర్సరీలలోనే ఉండిపోతున్నాయి.

మరిన్ని వార్తలు