బీఎస్‌ఎన్‌ఎల్‌లోనూ ఆధార్‌

21 Jun, 2019 08:09 IST|Sakshi
లాంఛనంగా రెండు బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారుల సేవా కేంద్రాల్లో ప్రారంభం

సాక్షి,సిటీ బ్యూరో: కొత్తగా ఆధార్‌ నమోదు, కార్డుల్లో మార్పులు..చేర్పులు, తప్పుల సవరణలు జరగక ఇబ్బంది పడుతున్నారా..? ఇక నుంచి ‘ఆధార్‌’ అవస్థలుండవు. మీ సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారుల సేవా కేంద్రం(సీఎస్‌సీ)కి వెళితే సరిపోతుంది. 15 నిమిషాల్లో కొత్తగా ఆధార్‌ నమోదు, అప్‌ డేషన్‌ ప్రక్రియ పూర్తి అవుతుంది. కొత్తగా నమోదుకు ఉచిత సేవలు ఉండగా, మిగతా వాటికి నామమాత్రపు సర్వీసు చార్జీలు వసూలు చేస్తారు. ఇరవై నాలుగు గంటల్లోగా ఈ–ఆధార్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పక్షం రోజుల్లో ఇంటికి ఒరిజనల్‌ ఆధార్‌ కార్డు అందుతుంది. ఆధార్‌కార్డు నమోదు 98 శాతంపైగా పూర్తి కాగా, అందులో 30 శాతం కార్డుల్లో అచ్చు తప్పులు, ఇతర పొరపాట్లు ఉండటంతో ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు.

బహుళ ప్రయోజనకారి ఆధార్‌
 ప్రస్తుతం అన్ని సేవలకు ఇదే ఆధారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా  ప్రైవేటు సంస్థలు తమ సేవలను ఆధార్‌తో అనుసంధానం చేయడంతో ఆ«ధార్‌ తప్పనిసరిగా మారింది.భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) అధీకృత కేంద్రాలు ద్వారా సేవలు అందిస్తోంది. బ్యాంకులు కూడా ఆధార్‌ సేవలు అందిస్తున్నాయి. రెండేళ్ల క్రితం తపాలా శాఖ యూఐడీఏఐతో ఒప్పందం కుదుర్చుకొని ఆధార్‌ నమోదు, అప్‌డేషన్‌  కేంద్రాలు ఏర్పాటు చేయగా, తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ కూడా ముందుకొచ్చింది బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులు సేవా కేంద్రం (సీఎస్‌సీ)లో ఆధార్‌ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

తెలంగాణలో 173 కేంద్రాలు...
హైదరాబాద్‌లో 57 కేంద్రాలు బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలంగాణ సర్కిల్‌లో 173 కేంద్రాలు ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగా హైదరాబాద్‌ మహానగరంలో  57 కేంద్రాలు ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిం చింది. తాజాగా గురువారం అమీర్‌పేట, లింగం పల్లిలోగల  వినియోగదారుల కేంద్రాల్లో  ఆధార్‌ నమోదు కేంద్రాలను ప్రారంభించింది. ఇప్పటికే టెలికం సిబ్బందికి ఆధార్‌ నమోదు, అప్‌డేషన్‌పై యూఐడీఏఐచే ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ప్రతి కేంద్రానికి ఇద్దరు, ముగ్గురు చొప్పున సిబ్బందికి బయోమెట్రిక్‌ ఆథరైజ్‌ çసర్టిఫికేషన్‌ జారీ చేయిస్తున్నారు. 

ఆధార్‌ సేవలు ఇలా....
బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారుల సేవా కేంద్రాల్లో  కొత్త ఆధార్‌ నమోదుతోపాటు కార్డుల్లో చేర్పులు, మార్పులకు సంబంధించిన పలు సేవలు అంది స్తారు. అడ్రస్‌ అప్‌డేట్, ఫొటో, బయో మెట్రిక్‌ అప్‌డేట్, పేరు, పుట్టిన తేదీల్లో దొర్లిన తప్పులు, మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్, ఆధార్‌ డౌన్‌లోడ్‌ కలర్‌ ప్రింటర్‌ తదితర సేవలు అందిస్తారు. ఉచితంగా కొత్త ఆధార్‌ నమోదు  చేస్తారు. చిన్నపిల్లల ఆధార్‌ అప్‌డేట్‌ సేవలు కూడా ఉచితంగా అందిస్తారు. బయోమెట్రిక్‌ ఇతర అప్‌డేట్‌కు రూ. 50లు, ఆధార్‌ కలర్‌ ప్రింట్‌ డౌన్‌లోడ్‌ కు రూ. 30లు ఫీజు వసూలు చేస్తారు.

అప్‌డేట్‌ కోసం బయోమెట్రిక్‌ తప్పనిసరి
ఆధార్‌ అప్‌డేషన్‌  కోసం బయోమెట్రిక్‌ తప్పనిసరి. ఆధార్‌ వివరాలు నమోదు అనంతం  ఆథరైజ్‌ సిబ్బంది, కార్డుదారుడి బయోమెట్రిక్‌  ఆమోదం అనంతరమే యూఐడీఏఐ ప్రధాన సర్వర్‌ అప్‌డేషన్‌కు అనుమతి ఇస్తుంది. మొబైల్‌ నంబర్‌కు వచ్చే వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఏటీపీ) ఆధారంగా చేర్పులు, మార్పులు పూర్తి చేస్తారు. అనంతరం అప్‌డేషన్‌ ప్రక్రియ పూర్తయినట్లు మొబైల్‌కు సంక్షిప్త సమా చారం వస్తుంది. ఈ తతంగం 15 నిమిషాల్లో  పూర్తవుతుంది. 24 గంటల తర్వాత యూఐడీఏఐ వెబ్‌సైట్‌ నుంచి ఈ– ఆధార్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎన్నికలకు నో చెప్పిన హైకోర్టు

ఈనాటి ముఖ్యాంశాలు

విషాదం: లిఫ్ట్‌ వైర్ తెగి ఇద్దరి కార్మికుల మృతి

హైదరాబాద్‌లో నీటికి ఢోకా లేదు..

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

శ్రీచైతన్యలో పుడ్‌ పాయిజన్‌..40మందికి అస్వస్థత

సరిహద్దుల్లో ఉద్రిక్తత.. భారీ ఎన్‌కౌంటర్‌కు ప్లాన్‌

‘కేసీఆర్‌కు భవిష్యత్‌లో జైలు తప్పదు’

గ్రామాభివృద్ధికి సహకరించాలి :జిల్లా కలెక్టర్‌

‘నేను పార్టీ మారడం లేదు’

స్టూడెంట్‌ పోలీస్‌తో దురాచారాలకు చెక్‌!

సెల్ఫీ వీడియో; నాకు చావే దిక్కు..!

‘విదేశీయుల’పై నజర్‌!

బాడీ బిల్డర్స్‌కు మంత్రి తనయుడి చేయూత

‘న్యాక్‌’ ఉండాల్సిందే!

గ్రేటర్‌లో నకిలీ పాలసీల దందా

వాహనం ఢీకొనడంతో.. అంధకారంలో 20 గ్రామాలు!

ఒకటా మూడా?

కలుషిత ఆహారం తిన్నందుకు....

పోలీస్‌ @ అప్‌డేట్‌

హైదరాబాద్‌కు 48 రోజులే నీళ్లు అందించగలరా?

హామీలను సీఎం నిలబెట్టుకోవాలి

సర్కారు బడికి.. సర్పంచ్‌ కుమార్తె..

కాకతీయుల స్థావరాలు

ఒరిగిన బస్సు.. తప్పిన ముప్పు

బెంబేలెత్తిస్తున్న గ్రామ సింహాలు

రోడ్డు ప్రమాదంలో సబ్‌ ఇంజనీర్‌ మృతి

తాగడానికే నీళ్లులేవు.. మొక్కలు ఎలా పెంచాలి?

లెక్క తేలలేదు..

కొత్వాల్‌ కొరడా..! 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అలా 26 కిలోల బరువు తగ్గాను’

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!