అమ్మలూ.. ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు  

16 Jul, 2018 09:04 IST|Sakshi
ర్యాలీని ప్రారంభిస్తున్న డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, ఆకాష్‌ పూరి

డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి

మిలియన్‌ మామ్స్‌ ర్యాలీ ప్రారంభం

పాల్గొన్న నటుడు ఆకాష్‌ పూరి

శంషాబాద్‌: నిత్యం కుటుంబ బాధ్యతల్లో తలమునకలయ్యే అమ్మలందరూ ఆరోగ్యంపై తప్పనిసరిగా శ్రద్ధ తీసుకోవాలని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని నొవాటెల్‌ హోటల్‌ వద్ద మిలియన్‌ మామ్స్‌ కార్‌ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు.

అమ్మ బాగుంటేనే కుటుంబంలోని సభ్యులంతా ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. మహిళల ఆరోగ్యంపై చైతన్యపరిచే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ ర్యాలీ విజయవంతం కావాలని ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్‌ ఆకాంక్షించారు. సమయం, వేగం, గమ్యం ఆధారితంగా నిర్వహించే ఈ ర్యాలీలో మొత్తం 75 మంది మహిళలు పాల్గొన్నారని కార్యక్రమ నిర్వాహకులైన షాదాన్‌ విద్యాసంస్థల ప్రతినిధులు తెలిపారు.

ఇందులోంచి ఇద్దరిని విజేతలు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. ర్యాలీ నొవాటెల్‌ నుంచి కాళీమందిర్‌ సమీపంలోని షాదాన్‌ కాలేజీ వరకు ఉంటుందన్నారు. మొత్తం మిలియన్‌ మంది మహిళలను చైతన్యం చేసే విధ ంగా కార్యక్రమాలను రూపొందించినట్లు డాక్టర్‌ మనిపవిత్ర తెలిపారు. విజేతలను సోమవారం ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్‌ కుమారుడు, నటుడు ఆకాష్‌ పూరి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు