విజయారెడ్డికి కన్నీటి వీడ్కోలు..

5 Nov, 2019 15:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ చెరుకూరి విజయారెడ్డి అంత్యక్రియలు నాగోల్‌ శ్మశాన వాటికలో పూర్తయాయి. విజయారెడ్డి అంతిమయాత్రలో రెవెన్యూశాఖ ఉద్యోగులు, స్థానికులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పెద్దసంఖ్యలో ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం నాగోల్‌ శ్మశాన వాటికలో విజయారెడ్డి భౌతికకాయానికి భర్త సుభాష్‌రెడ్డి దహన సంస్కారాలు నిర్వహించి.. అంత్యక్రియలు పూర్తి చేశారు.

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ కార్యాలయంలోనే విజయారెడ్దిని కూర సురేశ్‌ అనే రైతు పెట్రోల్‌ పోసి.. పట్టపగలే అమానుషంగా సజీవం దహనం చేసిన సంగతి తెలిసిందే. పట్టాదారు పాసుపుస్త కాల్లో తమకు బదులుగా కౌలుదార్ల పేర్లను చేర్చారన్న కోపంతో ఆ వ్యక్తి ఈ దుర్మార్గానికి ఒడిగడ్డాడు. తమ కుటుంబాలకు దక్కాల్సిన భూమిని తమకు దక్కకుండా చేస్తున్నారని కక్షగట్టి ఘాతుకానికి పాల్పడ్డాడు. పక్కా పథకంతో కార్యాలయంలోని తహసీల్దార్‌ గదిలోకి పెట్రోల్‌ డబ్బాతో చొరబడ్డ కూర సురేశ్‌... రెప్పపాటులోనే విజయారెడ్డి ఒంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించేశాడు. అంతే.. అందరూ చూస్తుండగానే తహసీల్దార్‌ విజయారెడ్డి మంటల్లో చిక్కుకొని సజీవదహనమయ్యారు.  ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన కారు డ్రైవర్‌ గురునాథ్, అటెండర్‌ చంద్రయ్య తీవ్రంగా గాయపడ్డారు. కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఎల్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరిలో గురునాథ్‌ మంగళవారం ప్రాణాలు విడిచాడు. విజయారెడ్డికి భర్త సుభాష్‌తోపాటు ఇద్దరు చిన్నపిల్లలు.. అమ్మాయి(10), అబ్బాయి(5) ఉన్నారు. తల్లి మరణంతో పిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈనాటి ముఖ్యాంశాలు

ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన సంజయ్‌

గాంధీభవన్‌లో రసాభాస.. నేతల వాగ్వాదం

తరుముతున్న డెడ్‌లైన్‌.. కార్మికుల్లో టెన్షన్‌!

నినాదాలు కాదు.. ఆచరణ ఎక్కడ..? : ఆజాద్‌

రెవెన్యూ ఉద్యోగుల విధుల బహిష్కరణ

తీర్పు నేపథ్యంలో సంయమనం పాటించాలి

హైదరాబాద్‌ దేశ రెండో రాజధాని కావొచ్చు: మాజీ గవర్నర్‌

ఆర్టీసీ సమ్మె: కేంద్రం అనుమతి తప్పనిసరి

‘మరిన్ని రోబోటిక్‌ యంత్రాలు అందుబాటులోకి’

తహసీల్దార్‌ హత్య : ‘రూ.2 వేలు ఇవ్వకుంటే గల్లా పడుత’

మొన్న ఆర్టీసీ, నిన్న రెవెన్యూ.. రేపు..?: రేవంత్‌

ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు : ఎంపీ

‘అధికారులకు అలా జరగాల్సిందే..’

మణిహారానికి మెరుగులు

ఓఆర్‌ఆర్‌ ‘గ్రోత్‌’కు నవశక్తి

వద్దనుకుంటే వదిలేద్దాం

మల్లేపల్లి : స్కూల్‌ బస్సు కింద పడి విద్యార్థి మృతి

ట్రాఫిక్‌ వేళ..రాంగే రైటు!

ఆర్టీసీ సమ్మె : డిపో మేనేజర్‌పై ముసుగువేసి దాడి

వినండి.. మాట్లాడండి

28 దేశాలకు హైదరాబాద్‌ నుంచే సునామీ హెచ్చరికలు

ఆదివాసీ గ్రామాల్లో ఘనంగా కోలాబోడి!

ఖమ్మంలో కారు బోల్తా; ఒకరి మృతి

మొక్కజొన్న చేనులో లైంగిక దాడి?

పది నిమిషాలకే గేట్లు మూసేస్తారా.!

‘కానిస్టేబుల్‌ అని పిల్లనివ్వడం లేదు’

న్యాల్‌కల్‌ రోడ్డులో భారీ చోరీ

దేవరకొండలో ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వాళ్లకిష్టమైతే పెళ్లి చేస్తాం: రాహుల్‌ పేరెంట్స్‌

బిగ్‌బాస్‌ ఫలితంపై స్పందించిన కత్తి మహేశ్‌

బిగ్‌బాస్‌: శ్రీముఖి కొంపముంచిన ‘టాటూ’

రాహుల్ గెలుపును తప్పుబట్టిన శ్రీముఖి

అనుకూలం కాబట్టే రజనీకి అవార్డు

నేను నటిస్తున్నానంటే..