మంచిగా చెప్తే వినరురా మీరు : మహిళలు

19 Dec, 2019 13:57 IST|Sakshi

సాక్షి, కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా : కెరమెరిలో మండలంలో బెల్టు షాపు నిర్వాహకుడిపై ఆదివాసీ మహిళలు బుధవారం దాడి చేశారు. బెల్టు షాపు నిర్వహించవద్దని గతంలోనే మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. అయినా తీరు మారకపోవడంతో ఆగ్రహించిన మహిళలు నిర్వాహకుడిని చితకబాదారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఏజెన్సీలో సంపూర్ణ మద్య నిషేధం అమలవుతుండగా, గిరిజన సంఘాల తీర్మానం మేరకు ఏజెన్సీ ప్రాంతంలోని వైన్‌షాపులకు అధికారులు టెండర్లు పిలవలేదు. దీంతో ఏజెన్సీలో వైన్‌షాపులు లేవు, మద్యం అమ్మకాలు లేవు. బెల్టుషాపులు కూడా ఉండొద్దంటూ ఆదివాసీ మహిళలు ఊరూరా తిరిగి షాపులలో ఉన్న మద్యం సీసాలను అప్పుడే ధ్వంసం చేశారు. సంఘాల తీర్మానాన్ని ఎవరైనా అతిక్రమిస్తే పది వేల రూపాయల జరిమానాతో పాటు దుకాణాల మీద దాడులు తప్పవని గతంలోనే హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు