ఏసీబీ దాడి.. నాలుగోసారి

2 Jul, 2015 00:15 IST|Sakshi

హన్మకొండ అర్బన్ : కలెక్టరేట్‌లో లంచం తీసుకుంటూ అధికారులు, సిబ్బంది ఏసీబీకి చిక్కడం ఇది నాలుగోసారి.  సుమా రు పదేళ్ల కిత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంపై ఉన్న చిన్నమొత్తాల పొదుపు ప్రత్యేక తహసీల్దార్‌గా పనిచేసిన పంత్ ఒక ఏజెంట్ నుంచి లెసైన్స్ రెన్యూవల్ విషయంలో లంచం డిమాండ్ చేసి డబ్బు లు తీసుకుంటూ కలెక్టరేట్‌లోనే ఏసీబీకి చిక్కాడు.

2010లో కలెక్టరేట్ ప్రగతి భవనంలో సోషల్ వెల్ఫేర్ డీఎస్‌డబ్ల్యూవోగా పనిచేసిన వై.గాలయ్య ఒక వార్డెన్‌కు సంబంధించి వైద్య ఖర్చుల బిల్లులు మంజూరు విషయంలో సంతకాల కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డా రు. ఇదేశాఖలో గాలయ్య తర్వాత ఇన్‌చార్జ్ డీఎస్‌డబ్ల్యూవోగా బాధ్యతలు స్వీకరిం చిన ఏఎస్‌డబ్ల్యూఓ ప్రభాకర్ అదే వార్డెన్‌కు గ్రేడ్‌వన్ పదోన్నతి ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారు లకు పట్టుడ్డారు.
 

మరిన్ని వార్తలు