ఏసీబీకి చిక్కిన సోషల్ వెల్ఫేర్ అధికారి

5 Jun, 2015 17:57 IST|Sakshi

కరీంనగర్ : కల్యాణలక్ష్మి పథకం కోసం వచ్చిన ఒక జంట వద్ద నుంచి రూ. 10వేలు లంచం తీసుకుంటూ సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్‌కు చెందిన సీనియర్ అసిస్టెంట్ మల్లయ్య ఏసీబీకి చిక్కారు. ఈ సంఘటన శుక్రవారం కరీంనగర్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని సుభాష్‌నగర్‌కు చెందిన సుబేర్ అనే యువకుడు మతాంతర వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. దీంతో కల్యాణలక్ష్మి పథకం కోసం వెల్ఫేర్ అధికారి మల్లయ్యను సంప్రదించారు. అయితే ఈ పథకం అమలు కోసం అతను రూ. 10వేలు డిమాండ్ చేశాడు. దీంతో సుబేర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం.. సుబేర్ నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా మల్లయ్యను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు