తెరపైకి మరోసారి ఓటుకు కోట్లు కేసు

17 Mar, 2020 10:12 IST|Sakshi

నేడు ఏసీబీ కోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ

ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన ఏసీబీ

రేవంత్‌ను కోర్టుకు హాజరు పరుస్తారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులు కోర్టుకు హాజరుకావాల్సి ఉంది.  ఈ కేసులో ఏ1 గా ఉన్న రేవంత్‌రెడ్డి డ్రోన్‌ కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉండటంతో ఆయనను నేడు ఏసీబీ కోర్టుకు హాజరుపరుస్తారా? లేదా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. 2015లో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్‌ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.(రేవంత్‌ మెడ చుట్టూ బిగుస్తున్న కేసుల ఉచ్చు)

ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన ఏసీబీ.. మొత్తం 960 పేజీలతో చార్జిషీట్‌ దాఖలు చేసింది. అందులో ఈ కేసులో నిందితుల పాత్ర, అసలు సూత్రధారుల సంబంధించి కీలక విషయాలను పొందుపరిచారు. స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది. ఎవరు సమకూర్చారు అనే అంశం కీలకంగా మారింది. ఇప్పటికే కోర్టుకు ఆడియో టేపుల ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు చేరాయి. ఓటుకు కోట్లు కేసు విచారణ ఏసీబీ కోర్టులో వేగంగా సాగుతుంది. త్వరలోనే ఈ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి.
(చర్లపల్లి జైలుకు రేవంత్‌..)
(రేవంత్‌ నేరాల పుట్ట బయటపడింది)

మరిన్ని వార్తలు