అవినీతి నిర్మూలనెట్లా?

28 Nov, 2019 11:26 IST|Sakshi

ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో మూడంటే మూడే ఏసీబీ కేసులు

రెగ్యులర్‌ డీఎస్పీ లేరు.. ఇన్‌చారీ్జయే దిక్కు

ఫిర్యాదుదారుడికి భరోసా ఇవ్వలేకపోతున్న శాఖ

సాక్షి, ఆదిలాబాద్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు అవినీతి నిరోధకశాఖ ఆధ్వర్యంలో కేవలం మూడంటే మూడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. 2015 సంవత్సరం కంటే ముందు కరీంనగర్‌ డీఎస్పీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ ఏసీబీ పనిచేసేది. అప్పట్లో డబుల్‌ డిజిట్‌లో కేసులు నమోదు కాగా, ఉమ్మడి ఆదిలాబాద్‌ ఏసీబీ అప్‌గ్రేడ్‌ అయి డీఎస్పీ పోస్టు కేటాయించిన తర్వాత వరుస సంవత్సరాల్లో కేసులు కేవలం ఇతని పేరు గణపతివార్‌ వెంకట్‌రాజు. బేల మండలం సాంగిడి గ్రామం. 2013 సంవత్సరంలో ఓ అధికారి అవినీతిపై ఏసీబీని ఆశ్రయించి అతన్ని పట్టించేలా చేశాడు. ఈ కేసు తర్వాత రాజుపై భూ సంబంధిత వ్యవహారంలో ఓ అధికారిపై దౌర్జన్యం చేసిన కేసు నమోదైంది. దీనిపై ఐదేళ్ల పాటు పోరాడి దాని నుంచి బయట పడ్డాడు. ఇతనికి సహాయపడ్డ ఓ న్యాయవాదిపై కూడా కేసు నమోదైంది. బాధితుడి తల్లిదండ్రులను కూడా ఓ కేసులో ఇరికించారు. అవినీతికి పాల్పడిన ఒక్క అధికారిని ఏసీబీకి పట్టిస్తే తనకు ఇన్ని శిక్షలా అని ఆయన మదనపడే పరిస్థితి. సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడం గమనార్హం. అయితే కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు దీనికి కూడా అనేక కారణాలు ఉన్నాయి.

ప్రస్తుతం రెగ్యులర్‌ డీఎస్పీ పోస్టు భర్తీ చేయకపోవడం, కరీంనగర్‌ డీఎస్పీకే ఆదిలాబాద్‌ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడం జరిగింది. గత ఐదారు నెలలుగా ఆయన ఇన్‌చార్జి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇక పైన పేర్కొన్నట్లు ఎవరైన బాధితుడు అవినీతికి వ్యతిరేకంగా అధికారులపై ఏసీబీని ఆశ్రయించిన తర్వాత జరుగుతున్న పరిణామాలకు కూడా బాధితుడి పరంగా ఎలాంటి స్వాంతన లేకపోవడం కూడా ఇలాంటి పరిస్థితులకు కారణమన్న అభిప్రాయం లేకపోలేదు. ∙ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఉన్న ఏసీబీ శాఖ కార్యాలయంలో ప్రస్తుతం కరీంనగర్‌ డీఎస్పీ ఇన్‌చార్జిగా ఉండగా, సీఐలుగా ప్రశాంత్, నర్సింహ వ్యవహరిస్తున్నారు. ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. నలుగురు కానిస్టేబుల్‌ పోస్టులకు గాను ఒకరు మాత్రమే ఉన్నారు. మూడు హోంగార్డు పోస్టులకు ముగ్గురు పనిచేస్తున్నారు.

  • 2015లో ఆదిలాబాద్‌ ఏసీబీని అప్‌గ్రేడ్‌ చేస్తూ డీఎస్పీ పోస్టు కేటాయించారు. మంచిర్యాల, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్‌తోపాటు ఆదిలాబాద్‌ జిల్లాలో దీని పరిధి విస్తరించి ఉంది. ప్రజల్లో అవినీతికి వ్యతిరేకంగా అవగాహన కల్పించడంలోనూ వెనకబడడం కూడా కేసులు పెరగకపోవడానికి ఓ కారణమన్న అభిప్రాయం లేకపోలేదు. డిసెంబర్‌లో ఏసీబీ ఆధ్వర్యంలో వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమాలు మినహాయిస్తే ఏడాది పొడవున ఎలాంటి ఉలుకు పలుకు ఉండదు. దీంతో శాఖ పరమైన ప్రభావం కనిపించదు.
  • ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరెప్షన్‌ 2018 యాక్ట్‌ ప్రకారం ఏసీబీ కేసుల్లో అదనంగా కొన్ని అంశాలను జోడించడం జరిగింది. దాని ప్రకారం లంచం డిమాండ్‌ చేసినట్లు రికారి్డంగ్‌ ఉన్న ఏసీబీ అధికారులు పరిగణలోకి తీసుకొని నిఘా పెట్టే ఆస్కారం ఉంది. ప్రభుత్వ శాఖలో ఒక వ్యవహార నిర్వహణకు సంబంధించి ఎవరైన వ్యక్తికి, అధికారికి మధ్యవర్తిత్వం వహిస్తే అతనిపై కూడా కేసు నమోదు చేసే పరిస్థితి ఉంటుంది. 
  • ప్రభుత్వ శాఖల వ్యవహారంలో అధికారులు లాడ్జి, హోటళ్లలో గదులు అరేంజ్‌ చేయమని, విందు ఇవ్వమని చెప్పడం కూడా నేరమే. అలాగే వాహనం ఏర్పాటు చేయాలనడం కూడా నేరం కిందికే వస్తుంది. పని జరిగిన కొంత కాలం తర్వాత కూడా లంచం డిమాండ్‌ చేయడం నేరమే. ఇలాంటి పరిస్థితుల్లో బాధితుడు ఏసీబీని ఆశ్రయించవచ్చని అధికారులు తెలుపుతున్నారు. ఇలా చట్టంలో అనేక అంశాలు జోడించినప్పటికీ బాధితులు ముందుకు రాకపోవడం, కేసులు పెరగకపోవడం గమనించదగ్గ విషయం.
  • అవినీతిపై ఫిర్యాదు కోసం రాష్ట్ర వ్యాప్తంగా టోల్‌ఫ్రీ నం.1064 ఏర్పాటు చేశాం. దీనికి కాల్‌చేసి ఫిర్యాదు చేసిన పక్షంలో పైస్థాయిలోనూ వివరాలు నమోదవుతాయి. తద్వారా జిల్లా స్థాయిలో ఏసీబీ అధికారులు కేసుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించే అవకాశం ఉంటుంది.

గోప్యంగా ఉంచుతాం..
ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచి అవినీతి అధికారిపై నిఘా ఉంచి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని కేసు నమోదు చేస్తాం. ఫిర్యాదు వస్తే కేసులు నమోదు చేయడానికి మేము సిద్ధమే. – భద్రయ్య, ఇన్‌చార్జి డీఎస్పీ, ఏసీబీ, ఆదిలాబాద్‌

మరిన్ని వార్తలు