రేవంత్ బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టుకు ఏసీబీ

30 Jun, 2015 12:48 IST|Sakshi
రేవంత్ బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టుకు ఏసీబీ

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో  నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.

 

మంగళవారం ఉదయం రేవంత్ రెడ్డి సహా ఉదయ సింహా, సెబాస్టియన్ లకు ఉమ్మడి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని ఏసీబీ తరఫు న్యాయవాదులు ప్రకటించారు. హైకోర్టు తీర్పు కాపీలు అందిన వెంటనే సమాలోచనలు జరిపి ఒకటి రెండు రోజుల్లో  సుప్రీంకు వెళ్తామని స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్ కు ఇవ్వజూపిన రూ.50 లక్షలతో సహా.. ఇంకా ఇస్తానని చెప్పిన రూ. 4.5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయం ఇంకా తేలాల్సి ఉందని, ఏ 4 జెరుసలేం మత్తయ్యను ఇంకా విచారించలేదని, నోటీసులు ఇచ్చిన వ్యక్తులు కూడా తమ ముందు హాజరుకాని దరిమిలా ఎవ్వరికీ బెయిల్ ఇవ్వొద్దని ఏసీబీ తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదించారు.  అయితే కోర్టు మాత్రం నిందితులకు బెయిల్ మంజురు చేసింది.

మరిన్ని వార్తలు