ఫారెస్టు కార్యాలయంపై ఏసీబీ దాడులు

26 Feb, 2019 11:01 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్‌ రమణకుమార్‌   

నిజామాబాద్‌అర్బన్‌: నిజామాబాద్‌ ఉత్తర మండలం ఫారెస్టు రేంజ్‌ కార్యాలయంపై సోమవారం ఏసీబీ అధికారులు దాడి చేశారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన డిప్యూటీ డైరెక్టర్‌ రమణకుమార్‌ నలుగురు సిబ్బందితో కార్యాలయంలో తనిఖీలు  నిర్వహించారు. ఏసీబీ అధికారులు తనిఖీలు చేసే సమయంలో ఫారెస్టు అధికారి కార్యాలయంలో రూ. 94 వేలు పట్టుబడినట్లు సమాచారం. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై విచారణ చేపడుతున్నారు. ఇదిలా ఉండగా మూడు రోజుల కిందట నెలవారీ మూమూళ్ల కోసం ఫారెస్టు అధికారులు వేధింపులు చేపట్టడంతో బాధితుడు ఒకరు హైదరాబాద్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

అక్కడి నుండి ఏసీబీ అధికారులు తనిఖీలకు వచ్చినట్లు సమాచారం. రేంజ్‌ పరిధిలో మొత్తం సామిల్లులు ఎన్ని ఉన్నాయి. వాటి నిర్వహణకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈ తనిఖీల్లో నిజామాబాద్‌ డీఎస్పీ ప్రసన్నరాణితో పాటు సిబ్బంది ఉన్నారు. విచారణ పూర్తయిన తరువాతే వివరాలు వెల్లడిస్తామని డిప్యూటీ డైరెక్టర్‌ చెప్పారు. అక్రమ కలప వ్యవహారంలో ముగ్గురు అధికారులు సస్పెన్షన్‌కు గురికాగా, దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఏసీబీ దాడులు జరగడం కలకలరేగింది. అర్ధరాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి.

మరిన్ని వార్తలు