ఏసీబీ దాడులు.. కోట్లలో అక్రమాస్తులు గుర్తింపు

22 Feb, 2018 12:25 IST|Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఆదిలాబాద్‌ మున్సిపల్‌ డీఈ కొండల్‌రావు ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఆదిలాబాద్‌, వరంగల్‌​, కొత్తగూడెంలలో పలుచోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు రూ. 6 కోట్ల అక్రమాస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. 

కొత్తగూడెం జిల్లా రామానుజ కాలనీలోని మున్సిపల్‌ డీఈ మామ ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం వరంగల్‌లో మీడియాకు వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు