ఎంవీఐ ఇంటిపై ఏసీబీ దాడులు

6 Feb, 2017 10:35 IST|Sakshi
(ఫైల్ ఫొటో)

కొత్తగూడెం : భద్రాద్రి జిల్లాలో అవినీతి నిరోధక శాఖాధికారులు సోమవారం మెరుపు దాడులకు దిగారు. కొత్తగూడెం ఆర్టీఏ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ)గా పనిచేస్తున్న గౌస్‌పాషా ఇంటిపై ఏసీబీ సోదాలు చేపట్టింది.

కొత్తగూడెంలోని ఆయన ఇంటితో పాటు హైదరాబాద్‌, జమ్మికుంటలో ఉన్న బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో అక్రమాస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. కొత్తగూడెంలోని ఆయన ఇంట్లో రూ.26 వేల నగదుతో పాటు 5 సెల్‌ఫోన్లు, 2 కార్లు స్వాధీనం చేసుకొని ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. మొయినాబాద్‌లో 18 ఎకరాల ఫాంహౌస్‌, బండ్లగూడలో రూ.3 కోట్లకు పైగా అక్రమాస్తులు, పీరం చెరువులో 3,500 గజాల స్థలం, మూడు ఖరీదైన కార్లు గుర్తించామని డీఎస్పీ సాయిబాబా తెలిపారు. ఆయనపై తీవ్రస్థాయిలో అవినీతీ ఆరోపణల నేపథ్యంలోనే ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు