‘ఫేక్‌’బుక్‌ ఖాతాలపై చర్యలు

4 Nov, 2017 01:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం పేరిట, ప్రజా ప్రతినిధుల పేరిట నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీ శాఖ డిజిటల్‌ విభాగం నెటిజన్లకు హెచ్చరిక జారీ చేసింది. ‘ఫేక్‌’బుక్‌ సర్కార్‌’ శీర్షికన శుక్రవారం సాక్షి ప్రచురించిన కథనంపై వెంటనే స్పందించింది. ఫేస్‌బుక్‌లో ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల పేరిట ఉన్న నకిలీ ఖాతాలను తొలగించే చర్యలు చేపట్టింది. ఈ మేరకు ‘‘గత రెండేళ్లలో ప్రభుత్వాన్ని, ప్రజా ప్రతినిధులను అనుకరిస్తూ తెరిచిన దాదాపు 130 నకిలీ ఖాతాలను మూసివేయించాం.

మరో పదిహేను నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్లను తొలగించేలా శుక్రవారం చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వం మీద, నాయకుల మీద ఆపేక్షతో, అత్యుత్సాహంతో కొందరు వ్యక్తులు ఇలాంటి నకిలీ ఖాతాలు తెరుస్తున్నారు. వాటిని ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్‌ మీడియా విభాగం మానిటర్‌ చేస్తోంది. సంబంధిత వ్యక్తులను హెచ్చరిస్తోంది. రాష్ట్ర పోలీస్‌ శాఖలోని సైబర్‌ క్రైం విభాగం, ఫేస్‌బుక్‌ యాజమాన్యం సహాయంతో వాటిని తొలగిస్తున్నాం. ఇప్పటివరకు మానవతా దృక్పథంతో ఎవరిపైనా కఠిన చర్యలు తీసుకోలేదు.

మళ్లీ మళ్లీ అదే పొరపాటు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం..’’ అని డిజిటల్‌ మీడియా విభాగం డైరెక్టర్‌ కొణతం దిలీప్‌ ప్రకటన జారీ చేశారు. ప్రభుత్వం ‘తెలంగాణ సీఎంవో’, ‘ఐటీ మినిస్టర్‌ తెలంగాణ’ పేర్లతో అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలను నిర్వహిస్తోందని.. కొందరు మంత్రులు, ప్రభుత్వ సంస్థలు, ప్రజాప్రతినిధులకు అధికారిక పేజీలు ఉన్నాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. నీలి రంగులో ‘వెరిఫైడ్‌’టిక్‌ మార్కు ఉన్న ఫేస్‌బుక్‌ పేజీలనే అధికారిక పేజీలుగా గుర్తించాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల పేరిట నకిలీ ఫేస్‌బుక్‌ పేజీలున్నట్లు గుర్తిస్తే dir_dm@telangana.gov.in  కు ఫిర్యాదు చేయాలని కోరారు.  

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కోరుట్ల కాంగ్రెస్‌ అభ్యర్థిగా జువ్వాడి నర్సింగరావు

‘ఈ మధ్య ఓ పిల్లకాకి నన్ను ప్రశ్నించాడు’

ప్రజాస్వామ్యానికి ఓటే రక్ష

జోరుగా టీఆర్‌ఎస్‌ నాయకుల ప్రచారం..

 టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో.. గిరిజనులకు అన్యాయం 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘పెళ్లి చూపులు’ రోజులు గుర్తుకొస్తున్నాయి

‘రంగు’లో హీరోలు విలన్‌లు ఉండరు

#మీటూ : ‘అప్పుడు రాఖీ సావంత్‌.. ఇప్పుడు మీరు’

హ్యాపీ బర్త్‌డే బంగారం

‘నేను అలా పిలిస్తే ఆమె స్పృహ తప్పడం ఖాయం’

అభిమానులకు తలైవా హెచ్చరిక