దుబాయ్‌లో నటుడు శివాజీకి చేదు అనుభవం

27 Jul, 2019 19:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అలంద మీడియా కేసులో నిందితుడిగా ఉన్న సినీ నటుడు, గరుడ పురాణం శొంఠినేని శివాజీకి దుబాయ్‌ విమానాశ్రయంలో మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుబాయ్‌ మీదగా అమెరికా వెళుతున్న అతడిని ఈ నెల 26న దుబాయ్‌ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అడ్డుకున్నారు. శివాజీపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయంటూ తిరిగి అతడిని హైదరాబాద్‌ పంపించివేశారు. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌తో పాటు శివాజీపై హైదరాబాద్‌ పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలో కూడా హైదరాబాద్‌ నుంచి అమెరికా వెళ్లే ప్రయత్నంలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. ఆ తర్వాత  సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అతడికి విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా ఇచ్చారు.  కాగా విదేశాలకు వెళ్లేందుకు శివాజీపై  ఎలాంటి ఆంక్షలు లేవని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. దుబాయ్‌ పోలీసులు ఎందుకు ఆపారో తెలియదని అన్నారు. 

మరిన్ని వార్తలు