బాక్సింగ్ పోటీలు ప్రారంభించిన నటుడు సునీల్

25 Oct, 2014 03:26 IST|Sakshi
బాక్సింగ్ పోటీలు ప్రారంభించిన నటుడు సునీల్

శంషాబాద్ రూరల్: మండలంలోని ఒయాసిస్ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న బాక్సింగ్ పోటీలను సినీ నటుడు సునీల్ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. పుల్లారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ ఓపెన్ బాక్సింగ్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సునీల్‌తో పాటు విశ్రాంత ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంసృ్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని ప్రభాకర్‌రెడ్డి సూచించారు. హీరో సునీల్ తాను నటించిన సినిమాల్లోని డైలాగులు, డ్యాన్స్‌తో విద్యార్థులను ఉత్తేరపర్చారు. ఈ పోటీలు మూడు రోజుల పాటు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ చైర్మన్ జయరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు