వావ్‌.. వెడ్డింగ్‌...

14 Dec, 2019 11:35 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో:  టెన్నిస్‌స్టార్‌ సానియా మీర్జా సోదరి ఆనమ్‌ మీర్జా పెళ్లి వేడుకలు ముగిసినా ఆ ఈవెంట్‌ పార్టీ ప్రియులకు హాట్‌ టాపిక్‌గానే ఉన్నాయి. ఈ వారంలోజరిగిన సిటీ పార్టీల్లో వీరి పెళ్లి సంబరాలే హైలెట్‌గా నిలిచాయి. మాజీ భారత క్రికెట్‌ కెప్టెన్‌అజారుద్దీన్‌ కుమారుడు అసద్‌తో ఆనమ్‌ గత బుధవారం జోడి కట్టిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో గత వారం సిటీలోని పార్టీ సర్కిల్‌ మొత్తం ఈ పెళ్లి వేడుక విశేషాల గురించి ఆసక్తిగా చర్చించుకుంది. ఈ పెళ్లి సంబరాలలో భాగంగా నిర్వహించిన సంగీత్‌ వేడుకలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యాయి. 

వధూవరులిద్దరూ నగరానికి చెందిన టాప్‌ స్పోర్ట్స్‌ సెలబ్రిటీల కుటుంబానికి చెందిన వారు కావడం, ఈ వేడుకకు సిటిజన్లు పెద్ద సంఖ్యలో హాజరవడం... వంటి కారణాలతో పాటు ఆనమ్‌ మీర్జా కూడా నగరంలోని పార్టీ సర్కిల్‌లో, ఎక్స్‌పోల నిర్వహణల ద్వారా తనదైన గుర్తింపు తెచ్చుకోవడం వంటివి కూడా ఈ పెళ్లి వేడుకపై ఆసక్తిని బాగా పెంచాయి. అంతేకాకుండా టెన్నిస్‌ స్టార్‌ సానియా సంగీత్‌ సందర్భంగా తను, తన కుటుంబసభ్యులకు సంబంధించి షేర్‌ చేసిన అదరిపోయే చిత్రాలు ఈ పెళ్లి వేడుకపై క్రేజ్‌ని అమాంతం ఆకాశానికి పెంచేశాయి. అలాగే గతంలో ఆనమ్‌  బాచిలర్‌ పార్టీ కూడా ఇచ్చారు. 

సోషల్‌లో హల్‌చల్‌...
ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా ఆనమ్‌ అసద్‌ల పెళ్లి ఫొటోల షేరింగ్స్‌తో హోరెత్తింది. తాము సంప్రదాయబద్ధంగా వధూవరులమైనట్టు ప్రకటిస్తూ అంటూ ఆనమ్‌ తానే స్వయంగా ఇన్‌స్ట్రాగామ్‌ అకౌంట్‌లో  మిస్టర్‌ అండ్‌ మిస్ట్రెస్‌ అనే క్యాప్షన్‌తో  పోస్ట్‌ చేసిన ఫొటోలకు నెటిజన్లు లైక్స్, కంగ్రాట్స్‌ కురిపించారు. అలాగే అసద్‌ కూడా తమ ఇద్దరి ఫొటోలను షేర్‌ చేస్తూ ఫైనల్లీ మ్యారీడ్‌ ది లవ్‌ ఆఫ్‌ మై లవ్‌ అంటూ క్యాప్షన్‌ను జత చేశారు. ఈ పెళ్లికి అటెండ్‌ అయిన సిటీలోని ప్రముఖులు అందరూ పెళ్లి వేడుకలో తమ సందడి ఫొటోలను పెద్ద సంఖ్యలో సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు.  అయితే ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణ అయిన సానియా మీర్జా తన సోదరి పెళ్లి తాలూకు ఫొటోలను ఇంకా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయలేదు.   

స్టైల్స్‌...అదరహో...
మరోవైపు ఈ వేడుకల్లో ఆనమ్‌ ధరించిన దుస్తులు, ఆభరణాలు స్టైల్స్‌కి కేరాఫ్‌గా ఉండడంతో మరింతగా ఈ వేడుక టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయింది. బీగ్, గోల్డ్‌ షెర్వాణి తదితర దుస్తులతో అసద్, హెవీ ఎత్నిక్‌ దుస్తులు,పెళ్లి రోజున లావెండర్‌ అవుట్‌ ఫిట్‌. హవీ చోకర్, బ్యాంగిల్స్, ఇయర్‌ రింగ్స్, మ్యాంగ్‌ టిక్కా తదితర వెరైటీ ఆభరణ శైలులతో ఆనమ్‌... నగరంలోని ఫ్యాషన్‌ ప్రియుల కంటికి, నోటికి పూర్తిగా పని
కల్పించారు. 

మరిన్ని వార్తలు