అదనపు చెల్లింపులకు ఓకే!

16 May, 2015 00:51 IST|Sakshi

హైదరాబాద్:  సాగునీటి ప్రాజెక్టులకు పెరిగిన ధరలకు అనుగుణంగా ధరల పెంపు (ఎస్కలేషన్) చేయాలని ప్రభుత్వం నియమించిన ఎస్కలేషన్ కమిటీ నిర్ణయించింది. ఏపీలో ఎస్కలేషన్ అమలు చేస్తున్న దృష్ట్యా తెలంగాణలోనూ దీన్ని అమ లు చేయాల్సిందేనని  కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది.

ఈ మేరకు శుక్రవారం మరోమారు భేటీ అయిన కమిటీ తన తుది నివేదికను సిద్ధం చేసింది. జీవో-13ను చిన్నపాటి మార్పుచేర్పులతో అమలు చే యాలని కమిటీ తన నివేదికలో పే ర్కొన్నట్లుగా తెలిసింది. కాంట్రాక్టర్లు  కోరుతున్న మేర ఎస్కలేషన్ చెల్లిస్తే నీటిపారుదలశాఖపై రూ. 4వేల కో ట్ల భారం పడుతుందని సమాచారం.

మరిన్ని వార్తలు