ఆదుకునే హస్తం కోసం..!

5 Mar, 2019 16:58 IST|Sakshi

ఆరేళ్ల ప్రాయంలోనే అప్లాస్టిక్‌ ఎనీమియా (ఎముకల గుజ్జు మార్పిడి ) అనే వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని కాపాడాలని పేదవారైన ఆ తల్లిదండ్రులు తమగోడు వెళ్లబోసుకున్నారు. కరీంనగర్‌ జిల్లా జగిత్యాల మండలం హుస్నాబాద్‌కు చెందిన వావిలాల సంతోష్ కుమారుడు వావిలాల ఆదిత్య (6)అప్లాస్టిక్‌ ఎనీమియాతో బాధపడుతున్నాడు. తమ కుమారుడి చికిత్సకు దాదాపు రూ.20 లక్షలు కావాల్సి ఉండగా, కట్టు బట్టలతో మిగిలిన ఆ తల్లిదండ్రుల మనో వేదన మాటల్లో చెప్పలేనిది. సమయం గడుస్తున్న కొద్ది మరణానికి చేరువవుతున్న తమ కుమారుడిని రక్షించుకునేందుకు తల్లిదండ్రులు సాయమందించే దయా హృదయుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సింగపూర్‌ తెలుగుసమాజం అధ్యక్షులు కోటిరెడ్డి, ఉపాధ్యక్షులు జ్యోతీశ్వర్ రెడ్డి చొరవతో విరాళాలు ఇవ్వడానికి గ్రూపు సభ్యులు ముందుకొచ్చారు. లక్షా ముప్పై వేల రూపాయలను చిన్నారి తండ్రికి విరాళంగా అందించారు.

ఇప్పటి వరకు విరాళాలు అందించిన వారందరికి వావిలాల సంతోష్ ధన్యవాదాలు తెలిపారు. అయితే ఆదిత్య చికిత్సకు మరింత డబ్బు అవసరం అవ్వడంతో ఇంకా ఎవరైనా దాతలు సహాయం చేయగలిగితే దయచేసి చిన్నారి తల్లి అకౌంట్‌నెంబర్‌కి పంపించాలని, ఫోన్‌ నెంబర్‌ +91 96662 88820లో సంప్రదించాలని కోరారు.

మరిన్ని వార్తలు