హెచ్‌సీయూ అడ్మిషన్ల ప్రక్రియ షురూ

5 Apr, 2020 01:44 IST|Sakshi

ఆన్లైన్   దరఖాస్తుకు చివరి గడువు మే 3  

ప్రవేశ పరీక్షలు జూన్  2 నుంచి 6 వరకు  

దేశ వ్యాప్తంగా 38 ప్రవేశ పరీక్షా కేంద్రాలు 

128 కోర్సులలో 2,400 సీట్లు 

రాయదుర్గం: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ 2020–21 విద్యా సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అడ్మిషన్  కోసం దరఖాస్తులను మే 3వ తేదీలోగా ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. హెచ్‌సీయూలో 2,400 సీట్లు వివిధ కోర్సులలో ఉన్నాయి. మొత్తం 128 కోర్సులలో 16 ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు, 41 పొస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సులు, 15 ఎంఫిల్,10 ఎంటెక్, 46 పీహెచ్‌డీ కోర్సులు ఉన్నాయి. గతేడాది మొత్తం 119 కోర్సులలో 2,170 సీట్లు ఉండేవి. 

ఈ ఏడాది నుంచి కొత్తగా 17 కోర్సులు...182 సీట్లు 
హెచ్‌సీయూలో 2020–21 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా 17 కోర్సులు ప్రారంభిస్తుండగా వాటిలో 182 సీట్లు ఏర్పాటు చేశారు. అందులో ఎంఈడీ ఎడ్యుకేషన్ లో 50 సీట్లు, ఎంఏ జెండర్‌స్టడీస్‌–20, ఎంఏ కమ్యూనికేషన్  (మీడియాస్టడీస్‌) 25, ఎంఏ కమ్యూనికేషన్   (మీడియా ప్రాక్టీస్‌)–25, ఎంటెక్‌ మైక్రో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ వీఎల్‌ఎస్‌ఐ డిజైనింగ్‌–06, ఎంటెక్‌ మ్యానుఫాక్చరింగ్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌–18, పీహెచ్‌డీ మైక్రోబయాలజీ–04 (పునః ప్రారంభిస్తున్నారు), ఎంఫిల్‌ కంప్యూటర్‌ లిటరేచర్‌–08, ఎంఫిల్‌ సోషల్‌ ఎక్స్‌క్లూషన్   అండ్‌ ఇన్  క్లూజన్   పాలసీ–04, ఎంఫిల్‌ రీజనల్‌ స్టడీస్‌–04, పీహెచ్‌డీ థియేటర్‌ ఆర్ట్స్, కంపారిటివ్‌ లిటరేచర్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ స్టడీస్‌లో నాలుగేసి సీట్లు, రీజినల్‌ స్టడీస్, కాంగ్ని టివ్‌సైన్స్‌లలో రెండేసి సీట్లు, ఫోక్‌ కల్చర్‌ స్టడీస్, సోషల్‌ ఎక్స్‌క్లూజివ్‌ అండ్‌ ఇన్  క్లూజివ్‌ పాలసీలో ఒక్కో సీటును కొత్తగా ఏర్పాటు చేశారు  

మరిన్ని కోర్సులలో అడ్మిషన్లు ఇలా.. 
ఎంసీఏలో అడ్మిషన్ను నిట్‌ కామన్   ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఎన్‌ఐఎంసెట్‌ స్కోరు ద్వారా కేటాయిస్తారు. ఎంటెక్‌ కోర్సులో సీటును గేట్‌ ద్వారా సీసీఎంటీ లో ప్రతిభ చాటిన వారికి కేటాయిస్తారు. అయిదేళ్ళ ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌)లో సీటును సెంట్రల్‌ సీట్‌ అలోకేషన్   బోర్డు (సీఎస్‌ఏబి) జేఈఈ ద్వారా కేటాయిస్తారు. ఎంబీఏ సీటును క్యాట్, ఎంఎస్సీ బయోటెక్నాలజీలో సీటును న్యూఢిల్లీ లోని జేఎన్ యూ ద్వారా నిర్వహించే సీఈఈబీలో ప్రతిభ చాటిన వారికి కేటాయిస్తారు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ http://acad.uohyd.ac.inను లాగిన్  కావాలి. 

మరిన్ని వార్తలు