మక్తల్‌ను దత్తత తీసుకుంటా...

30 Nov, 2018 08:20 IST|Sakshi
ఊట్కూర్‌ రోడ్డుషోలో మాట్లాడుతున్న హరీశ్‌రావు  

పునరావాస గ్రామాల్లో సమస్యలు పరిష్కరిస్తాం 

రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు 

మాగనూరు, ఊట్కూరుల్లో రోడ్డు షో 

సాక్షి, మాగనూర్‌ (మక్తల్‌): మక్తల్‌ నియోజకవర్గాన్ని ద త్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని.. ఇది నా బాధ్యతగా తీసుకుంటానని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ప్రకటించారు. అలాగే మండలం లోని పునరావాస గ్రామాలైన నేరడగం, ఉజ్జెల్లిల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానని వెల్లడించా రు. మక్తల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిట్టెం రాంమోహన్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ గురువారం రాత్రి మాగనూరు మండల కేంద్రంలో గురువారం రా త్రి నిర్వహించిన రోడ్డు షోలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు.

ప్రస్తుత ఎన్నికలు అభివృద్ధి, అవకాశవాదానికి నడుమ జరుగుతున్నాయని తెలిపారు. ఈ మేరకు ప్రజలు అభివృద్ధి వైపు నిలిచి రాంమోహన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడగానే మండల సరిహద్దులో ఉన్న కృష్ణా నదీ జలాలను సమగ్రంగా ఉపయోగించుకుని రైతులకు సాగు, తాగునీరు అందిస్తామని తెలిపారు.  


తెలంగాణలో వచ్చేది కారు.. కేసీఆరే 
ఊట్కూర్‌ (మక్తల్‌) : రానున్న ఎన్నికల్లో తెలంగాణలో గెలిచేది కారు.. వచ్చేది కేసీఆరేనని ప్రజలు అంటున్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఊ ట్కూర్‌లో జరిగిన రోడ్డు షోలో ఆయన మాట్లాడా రు. మక్తల్‌ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అ న్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. తెలం గాణ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత వి ద్యుత్‌ అందిస్తోందని చెప్పారు.

అయితే, గత కాం గ్రెస్‌ ప్రభుత్వం మూడు గంటల కరెంటు ఇచ్చేవారని.. ఈసారి మహాకూటమి గెలిస్తే ఆరు గంటల విద్యుత్‌ మాత్రమే ఇస్తారని తెలిపారు. ఇక తాము రైతులకు ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.8వేల నుంచి రూ.10వేలకు పెంచనున్నట్లు తెలిపారు. అదే మహాకూటమి అధికారంలోకి వస్తే సమన్వయ సమితి సంఘాలు, రైతు పెట్టుబడి సాయం ఎత్తివేస్తామని చెబుతున్నందున ప్రజలు విజ్ఞతతతో ఆలోచించి ఓటు వేయాలని హరీశ్‌రావు కోరారు.  


ఊట్కూర్‌ పెద్ద చెరువుకు నీరు 
ఊట్కూర్‌ పెద్దచెరువుకు లిఫ్ట్‌ ద్వారా నీరు అందించి మండలంలో ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తామని హరీశ్‌రావు వెల్లడించారు. ఊట్కూర్‌లో రైతు బజార్‌ ఏర్పాటు, బస్టాండ్‌ మరమత్తులు చేపడుతామని, అంబేద్కర్‌ భవన్‌కు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రచార కార్యక్రమాల్లో మహబూబ్‌నగర్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిట్టెం మోహన్‌రెడ్డి, ఐడీసీ చైర్మన్‌ శంకర్‌రెడ్డి, స్టేట్‌ ట్రేడ్‌ యూనియన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవరి మల్లప్ప, టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బాద్మి శివకుమార్, జెడ్పీటీసీలు సరిత మధుసూదన్‌రెడ్డి, సూర్యప్రకాశ్‌రెడ్డి, చిట్టెం సుచరిత, విఠల్‌రావు ఆర్యతో పాటు ఎల్లారెడ్డి, శ్రీనివాసులు, ఈశ్వరయ్య, సురేందర్, ఉజ్జెల్లి సూరి, అరవింద్‌కుమార్, సుధాకర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, గోవిందప్ప పాల్గొన్నారు. 
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు