నేనున్నాను!

16 Jul, 2015 02:16 IST|Sakshi
నేనున్నాను!

- సాక్షి కథనానికి స్పందన
- ఆ చిన్నారులను దత్తత తీసుకుంటా..
- ముందుకొచ్చిన ఆస్ట్రేలియా వాసి గుప్తా
జిన్నారం:
అనారోగ్యంతో తల్లి.. ఆ బాధతో తండ్రి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతే దిక్కులేనివారయ్యారు వారిద్దరు పిల్లలు. ఈ చిన్నారుల ఆలనాపాలనా వృద్ధాప్యంలో కాలం వెళ్లదీస్తున్న నానమ్మ, తాతయ్యలపై పడింది. నిరుపేద కుటుంబం... ఏ దిక్కూ లేని దైన్యం... అనాథలైన చిన్నారులను ఆదుకోవాలంటూ ‘సాక్షి’ బుధవారం ప్రచురించిన ‘అయ్యో.. పాపం’ కథనానికి ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గుప్తా స్పందించారు. జిన్నారం మండలం దోమడుగుకి చెందిన చిన్నారులు యశ్వంత్, సాత్వికలకు సాయం చేస్తానని, వారిని దత్తత తీసుకుంటానని ఆయన ‘సాక్షి’ కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పారు. చిన్నారులు, వారి కుటుంబ వివరాలను తనకు అందించాలని కోరారు.

మరిన్ని వార్తలు