అపాయింటెడ్ డే తర్వాతే ఆ సంస్థల విభజన

24 May, 2014 02:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అపాయింటెడ్ డే నాటికి షెడ్యూల్ తొమ్మిదిలోని 20 సంస్థలను విభజించాలని ముందు నిర్ణయించినప్పటికీ.. ఇప్పుడది సాధ్యం కాదని, రెండు రాష్ట్రాల ఏర్పాటు తర్వాతే ఆ ప్రక్రియ చేపట్టాలని అధికారులు తాజాగా నిర్ణయించారు. ఇదే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతానికి జెన్‌కో, ఆర్టీసీలో మాత్రమే విభజన ప్రక్రియ పూర్తయిందని.. బ్రూవరీస్ కార్పొరేషన్, పౌర సరఫరాల సంస్థ, సీడ్స్ కార్పొరేషన్, ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్, విద్యుత్ ఆర్థిక సంస్థ, రాష్ట్ర గిడ్డంగులు, పర్యాటకాభివృద్ధి సంస్థ, గృహ నిర్మాణ శాఖ, విత్తనాభివృద్ధి సంస్థ, వైద్య మౌలిక సదుపాయల సంస్థలను జూన్ రెండో తేదీకి విభజించాలని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలని గవర్నర్ వద్ద జరిగిన సమావేశంలో నిర్ణయించారు. అయితే వీటి విభజన అంత సులువు కాదని, అందుకు గడువు కావాలని ఆయా సంస్థల అధిపతులు కోరినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు