మామ చితి వద్దే కుప్పకూలిన అల్లుడు

13 Sep, 2019 08:45 IST|Sakshi
మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య, కూతుళ్లు, బంధువులు

అంత్యక్రియలకు వచ్చి అనంత లోకాలకు..

నంగునూరు మండలం బద్దిపడగలో విషాదం

సాక్షి, సిద్దిపేట:  ఇంటి పెద్ద మరణించి పుట్టెడు దుఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని విధి వక్రికరించింది. అంత్యక్రియలు నిర్వహిస్తున్న క్రమంలో అస్వస్థకు గురైన అల్లుడు చితి వద్దే కుప్పకూలాడు. దీంతో రెండు ఇళ్లలో విషాదం నెలకొంది. ఈ ఘటన గురువారం నంగునూరు మండలం బద్దిపడగ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బద్దిపడగ గ్రామానికి చెందిన పండగ నారాయణ (65) సింగరేణి బొగ్గు గనిలో పని చేసి ఉద్యోగ విరమణ పొందాడు.

ఉపాధి కోసం సిద్దిపేటలో ప్రైవేట్‌ జాబ్‌ చేస్తూ అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. బుధవారం రాత్రి అస్వస్థకు గురై  నారాయణ మృతి చెందాడు.  గురువారం మధ్యాహ్నం బుద్దిపడగలో అంత్యక్రియలు నిర్వహిస్తున్న క్రమంలో అతని అల్లుడు(కూతురు భర్త) తుపాకుల శ్రీధర్‌బాబు (36) చితి వద్దే సొమ్మసిల్లి పడిపోయాడు. ఇది గమణించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే శ్రీధర్‌బాబు మృతి చెందినట్లు తెలిపారు.  సిద్దిపేటలకు చెందిన శ్రీధర్‌బాబు డ్రైవర్‌గా పని చేస్తుండగా అతని భార్య సుజాత ప్రైవేట్‌ స్కూల్‌లో పని చేస్తోంది. ఆయనకు ఇద్దరు కూతుళ్లు లతిక, కీర్తికలున్నారు.

బుధవారం సుమోలో ముంబాయికి కిరాయకు వెళ్తుండగా అతని మామయ్య నారాయణ వార్త తెలియడంతో  బుధవారం రాత్రి శ్రీధర్‌బాబు ఇంటికి చేరుకొని అంత్యక్రియలకు దగ్గరుండి ఏర్పాటు చేశాడు. మామ మృతదేహాన్ని చితిపై ఉంచి కుటుంబ సభ్యులతో కలసి చితి చుట్టూ తిరుగుతుండగా ఉన్నట్లుండి శ్రీధర్‌బాబు కిందపడిపోయాడు. ఒకేసారి తండ్రి, భర్త  మరణించడంతో విలపిస్తున్న సుజాతను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. ఈ హృదయవిదారక ఘటనను అందరిని కలిచివేసింది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బోరుమన్న బోరబండ

పుట్టిన ఊరు కన్నతల్లితో సమానం  

బందోబస్తు నిర్వహించిన ప్రతాప్‌

పల్లెల అభివృద్ధికి కమిటీలు

సాగు విస్తీర్ణంలో ఫస్ట్‌..! 

85% మెడికోలు ఫెయిల్‌

వారంలో వెయ్యికిపైగా  డెంగీ కేసులా?

గవర్నర్‌ను కలసిన బండారు దత్తాత్రేయ  

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే షకీల్‌ అలక!

కమలదళం వలస బలం! 

సిరిచేల మురి‘‘పాలమూరు’’

...నాట్‌ గుడ్‌!

‘ఇప్పటికి  అద్దె  బస్సులే’

‘పనిచేయని సర్పంచ్‌కు చెత్తబుట్ట సన్మానం’ 

మన ‘గ్రహ’బలం ఎంత?

గ్రామపంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం 

సభ్యత్వం, శిక్షణపై ప్రత్యేక దృష్టి : ఉత్తమ్‌

టీబీజీకేఎస్‌ నేత రాజీనామా? 

ప్రశాంతంగా నిమజ్జనం : డీజీపీ

‘యూరియా పంపిణీలో క్షణం వృథా కానివ్వం’

‘హిందువుల ఐక్యతకు చిహ్నం ఈ ఉత్సవాలు’

గిట్టుబాటే లక్ష్యం : మంత్రి గంగుల

మీతోనే అభివృద్ధి : సబితా ఇంద్రారెడ్డి 

ఫిల్మ్‌ నగర్‌ గణపతి లడ్డూ సరికొత్త రికార్డు

ఈనాటి ముఖ్యాంశాలు

‘ప్రశాంతంగా గణేష్‌ నిమజ్జనం’

టీఆర్‌ఎస్‌లో ఉండలేకపోతున్నా..రాజీనామాకు సిద్ధం

టీఆర్‌ఎస్‌కు మరో ఎమ్మెల్యే షాక్‌!

ఒమాన్‌లో ఏడాదిగా జీతాలు ఇవ్వని కంపెనీ

ప్రాణం మీదకు తెచ్చిన జెట్‌ కాయిల్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రేమలో ఉన్నా.. పిల్లలు కావాలనుకున్నప్పుడే పెళ్లి!

ఆ దర్శకుడిపై కేసు వేస్తా: జయలలిత మేనల్లుడు

హ్యాట్రిక్‌కి రెడీ

అందుకే నటించేందుకు ఒప్పుకున్నా

ఫుల్‌ జోష్‌

భవ్య బ్యానర్‌లో...